Home జాతీయ వార్తలు కేంద్ర మంత్రి శ్రీపాద యశోనాయక్‌కు కరోనా

కేంద్ర మంత్రి శ్రీపాద యశోనాయక్‌కు కరోనా

AYUSH minister tests positive for covid 19

న్యూఢిల్లీ: కేంద్ర ఆయుశ్ మంత్రి శ్రీపాద యశోనాయక్‌కు కోవిడ్-19 పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నట్టు తెలిపారు. తనతోపాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న వారు కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేకపోయినా పరీక్షల్లో పాజిటివ్ వచ్చిందన్నారు. అటు దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఈ వైరస్ చిన్న పెద్ద తేడా లేకుండా అందర్ని భయపెడుతోంది. ఇప్పటివరకు ముగ్గురు కేంద్ర మంత్రులకు కరోనా సోకింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ధర్మేంద్ర ప్రధాన్ కోవిడ్ తో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.