Home ఆఫ్ బీట్ ఇఎస్‌ఐ తరహాలో ఆయుష్మాన్

ఇఎస్‌ఐ తరహాలో ఆయుష్మాన్

edit

వరుస ప్రభుత్వాల ప్రాధాన్యతల జాబితాలో ఆరోగ్య సంరక్షణ ఎల్లప్పుడూ వెనుక వరుసలో ఉండటం చిత్రం. అది ప్రభుత్వ ఎజెండా కూడా కాదు. ఎన్నికల పోరాటం అనేక పర్యాయాలు అల్పమైన విషయాలపై జరుగు తుంటుంది. అందువల్ల ఎన్నికల సమయంలో కూడా ఆరోగ్య సమస్యలు చర్చకు నోచుకోవటం లేదు. చికిత్సకు విపరీతంగా పెరిగిన ఖర్చుపట్ల ప్రజల ఆక్రోశం డాక్టర్లపై దాడి రూపంలో వ్యక్తమవుతున్నది. అయితే ఆరోగ్య సమస్యలపై లోతైన చర్చ జరగటం లేదు.
ప్రజారోగ్యం ముఖ్యమైన రాజకీయ ఎజెం డా కావాలని, దానిపై బహిరంగ చర్చ జరగాలని ప్రజారోగ్య కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. అయితే గుండె ఆపరేషన్‌లలో ఉపయోగించే స్టెంట్ ధరల తగ్గింపును ప్రధాన మంత్రి బీహార్ ఎన్నికల్లో విజయవంతంగా ఉపయోగించుకున్నారు. వాస్తవా నికి ధరలు తగ్గించింది ప్రభుత్వం కాదు. అడ్వొకేట్ బీరేంద ర్ సంగ్వాన్ దాఖలు చేసిన కేసులో కోర్టు ఉత్తర్వు తర్వాత ప్రభుత్వం ఆ పని చేసింది. కరోనరీ స్టెంట్స్ ధర తగ్గింపు తర్వాత మందుల ధరలు క్రమబద్దీకరిం చటానికి ప్రభుత్వం చెప్పుకోదగ్గ చర్య లేవీ తీసుకోలేదు. అప్పటి నుంచీ వివిధ ప్రజారోగ్య క్రియాశీల కార్యకర్తలు మందుల ధరలు తగ్గించాలని, ఆరో గ్యానికి జడ్జెట్ పెంచాలని మరింత గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.
ప్రజారోగ్య సవాలును ఎదుర్కొనేందుకై ప్రభుత్వం జాతీయ ఆరోగ్య సంరక్షణ పథకం (ఎన్.హెచ్.పి.ఎస్.)తో ముందుకు వచ్చింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకంగా చెప్పబ డుతున్నది. ఇది 10 కోట్ల కుటుంబాలకు అనగా 50 కోట్ల మందికి వర్తిస్తుంది. ఆసుపత్రిలో చేరి చికిత్స పొందే వారికి రూ. 5 లక్షల వరకు ఉచిత వైద్యం లభి స్తుంది. అయితే ఎన్.హెచ్.పి.ఎస్. ఔట్ పేషంట్ శుశ్రూషకు, రోగ నిరోధక ఆరోగ్య సంరక్షణకు వర్తించదు.
దాదాపు 60 శాతం జనాభా ఏ కవరేజి లబ్ధినుంచైనా వెలుపలే ఉంటారు. అలా బయట ఉన్నవారిలో కొద్ది శాతం మాత్రమే వైద్యానికి సొంత ఖర్చు భరించగలుగు తారు. అందువల్ల ఎన్.హెచ్. పి.ఎస్. ఏ విధంగాను సమగ్రమైన సార్వజనీన ఆరోగ్య సంరక్షణ కొలబద్దను అందుకోదు. ఆరోగ్యా నికి సామాజిక గీటురాళ్లు స్వచ్ఛమైన త్రాగునీటి సరఫరా, తగినంతగా పారిశుద్ధ వ్యవస్థ, సరైన గృహవసతి, పౌష్టికాహారం, రోజువారీ అవసరాలకు సరిపడా వేతనాలు, ఆరోగ్య విద్య. అయితే ఇవేవీ ఈ పథకంలో భాగం కాదు.
బీమా కంపెనీల ప్రాథమిక ధ్యేయం లాభార్జన అని రుజువు చేయటానికి తగినన్ని కారణాలున్నాయి. ఆరోగ్య బీమా చేయబడేవారి సంఖ్య చాలా పెద్దగా ఉండటం, ఏ ఒక్క సమయంలోనైనా ఆసుపత్రిల్లో చేరేవారి సంఖ్య తక్కువగా ఉండటం వల్ల కంపెనీలు లాభాలు దండుకునే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. అయితే ఏ దశలోనైనా, ఇది గిట్టుబాటుగాలేదని కంపెనీలు నిర్ధారణకు వస్తే అవి ఏదొక సాకుతో తప్పుకునేందుకు సంకోచించవు. ప్రీమియం తక్కువగా ఉంటే వాటిలో చాలా కంపెనీలు ఈ పథకంలో చేరకపోవచ్చు.
ఒపి సంరక్షణ ఈ పథకం కిందకు రాదు కాబట్టి మెజారిటీ రోగులకు దీన్నుంచి ఎటువంటి వాస్తవిక లబ్ధి అందదు. అనారోగ్యానికి రోగులు సొంతంగా ఖర్చు పెట్టాల్సిన దానిలో 80 శాతం ఔట్ పేషంట్ చికిత్సపైనే ఉంటుంది. అది ఎన్.హెచ్. పి.ఎస్. కిందకు రాదు. అంతేగాక ఆస్పత్రి నుండి డిచ్ఛార్జి అయినాక వైద్యానికయ్యే ఖర్చును బీమా కంపెనీలు పెడతాయో లేక రోగులు భరించాలో స్పష్టత లేదు. అనేక జబ్బుల విషయంలో ఆసుపత్రి అనంతర ఖర్చు చాలా హెచ్చుగా, జీవితాంతం ఉంటుంది. బీమా కంపెనీలపై ఆధారపడిన ఏ పథకంలోనైనా వాటి నుంచి బకాయీలు రాబట్ట టానికి రోగులు ఎంతో శ్రమపడాల్సి ఉంటుంది. ఇది సాధారణ అనుభవం. ఇందుకు బదులుగా, ఉద్యోగుల రాజ్య బీమా పథకం (ఇఎస్‌ఐఎస్) సంఘటిత రంగంలోని ఉద్యోగులకు సామాజిక ఆర్థిక రక్షణకు ఉద్దేశించిన బహుముఖ సామాజిక భద్రతా పథకం.
అనారోగ్యం, ప్రశూతి, పని సమయంలో అంగ వైకల్యం లేదా మరణం వంటి సందర్భాల్లో బీమా పొందిన ఉద్యోగులకు, వారి కుటుం బాలకు వైద్యం అందిస్తుంది. ఇఎస్‌ఐ చట్టం, 1948 కింద నమోదైన ఉద్యోగికి అనారోగ్యంవల్ల పని చేయలేని కాలంలో, పని చేయగల సామర్థం తిరిగి పొందే వరకు పూర్తి స్థాయి వైద్య సంరక్షణ లభిస్తుంది. అనారోగ్యం, ప్రశూతి, పని కాలంలో గాయపడటం వంటి కారణాలతో పని నుంచి గైరుహాజరైన కాలంలో ఉద్యోగి వేతన నష్టాన్ని పరిహరిస్తూ ఆర్థిక సహాయం లభిస్తుంది. ఈ పథకం కుటుంబ సభ్యులకు కూడా వైద్యం అందిస్తుంది. ఇఎస్‌ఐ స్వయం సహాయక పథకం. నెలవారి వేతనాలు ప్రాతిపదికగా నిర్ణీత శాతం సొమ్మును ఉద్యో గులు, యజమానులు చెల్లిస్తారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాటి వాటా భరిస్తాయి.
మెడికల్ బెనిఫిట్, రిటైర్మెంట్ బెనిఫిట్, సిక్‌నెస్ బెనిఫిట్, అంగవైకల్య బెనిఫిట్, ప్రశూతి బెనిఫిట్, కదలలేక మంచానికే పరిమితమై నప్పుడు ఖర్చులు, అంత్యక్రియల ఖర్చులు, నిరుద్యోగ భృతి, వృత్తి పునరావాస అలవెన్స్ వగైరా ఇఎస్‌ఐ పథకం అందిస్తున్నది. అంటే ఈ పథకం ఔట్ పేషెంట్ సంరక్షణ నుంచి ఆసుపత్రిలో చికిత్స,డిచ్ఛార్జి అనంతర ఖర్చుల వరకు అందిస్తున్నది. ప్రభుత్వం వివిధ స్థాయిల్లో ఆరోగ్య సంరక్షణ కల్పించద లిచినపుడు ఇఎస్‌ఐఎస్ నమూనా అవుతుంది.
పౌరులందరినీ ఆరోగ్య సంరక్షణ కిందకు తీసుకు రావటానికి ఈ పథకాన్ని రీమోడల్ చేయవచ్చు. ఖర్చులో ఉద్యోగులు, యజమా నుల వాటా, స్వయం ఉపాధిపరుల వాటా, అతి పేదలను విరాళం నుంచి మినహాయించటం వంటి వాటిని సంబంధీకులందరితో చర్చించి నిర్ణయించవచ్చు. ప్రభుత్వ ఖజానా ఖర్చు నుంచి లాభం పొందేందుకు మాత్రమే ఆరోగ్య రంగంలో ప్రవేశించే బీమా కంపెనీలను దూరంగా ఉంచవచ్చు.

  * డాక్టర్ అరుణ్ మిత్రా