Home జాతీయ వార్తలు జన ప్రవాహం

జన ప్రవాహం

శ్వేతవర్ణ శోభితంగా చండీయాగ శాల
వేద మంత్రాలతో మార్మోగిన ఎర్రవల్లి
రెండులక్షలకుపైగా తరలివచ్చిన ప్రజలు
ఉదయం నుంచి ట్రాఫిక్ ఇబ్బందులు
ప్రధాన ద్వారం, భోజన శాల వద్ద తొక్కిసలాట
YAGAMసిద్దిపేట, ములుగు, జగదేవ్‌పూర్, వర్గల్ : లోక కల్యాణార్థం ముఖ్యమంత్రి తలపెట్టిన అయుత చండీయాగానికి భక్తుల తాకిడి పెరిగింది. భారీ కార్యక్రమాన్ని కనులారా వీక్షించడానికి ప్రజలు ఆసక్తి చూపడంతో మూడో రోజైన శుక్రవారం రెండు లక్షలకు పైగా తరలిరావడంతో యాగస్థలి జన ప్రవాహంతో కిటకిటలాడింది. మొన్న పసుపు, నిన్న గులాబి రంగు వస్త్రాలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించిన వారు నేడు శ్వేత వర్ణం వస్త్రాలు ధరించి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉదయం ఎనిమిది గంటల నుండే పూజాది కా ర్యక్రమాలు నిర్వహించారు. శృంగేరి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ జగద్దురు భారతీ తీర్థ మహాస్వామి శిష్యులు బ్రహ్మశ్రీ పురాణం మహేశ్వర శర్మ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. శృంగేరి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థ స్వా మికి వందే గురు పరంపర అంటూ రుత్విక్కులు పఠనం చేస్తుండగా ముఖ్యమంత్రి కెసిఆర్ గురువుకు సాష్టాంక ప్రమాణం చేసి కార్యక్రమం ప్రా రంభించారు. సప్తశథి పారాయణం ప్రారంభించే ముందు పూర్వాంగం కా ర్యక్రమం నిర్వహించారు. శృంగేరి పీఠం నుంచి వచ్చిన ప్రధాన రుత్విక్కులలో ఒకరైన ఫణీశశాంక శర్మ అయుత చండీయాగం ఆవిర్భావం పరిణామక్ర మాన్ని ఆయన వివరించారు. నవచండీ, శివ చండీ, సహస్ర చండీ యాగాలను చాలామంది కుటుంబ పరంగా వ్యక్తిగతంగా చేశారని ఆయన తెలిపారు. నేడు ముఖ్యమంత్రి కెసిఆర్ విశ్వమానవ కల్యాణం కోసం అయుత చండీ మహాయాగం కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ఇలాంటి కార్యక్రమం చాలా అరుదని, చరిత్రలో ఇలాంటి కార్యక్రమం నిలిచిపోతుందన్నారు. కార్యక్రమంలో మొదటి నాలుగు రోజులు సప్తశతి చండీపారాయణం పదివే లు, కోటి నివారణ పూజ చేయడం జరుగుతుందన్నారు. అయుత చండీయా గం పద్ధతులు డామర తంత్రంలో, సప్తశతి సర్వస్వంలో, చండీకోపార్చన రహస్యంలో వివరాలు దొరుకుతాయన్నారు. పన్నెండు వందల ఏళ్ల క్రితం జగద్గురు ఆది శంకరాచార్యులు శృంగేరీ పీఠం నెలకొల్పినపుడు ప్రతిష్ట చేసిన ఉభయ భారతీ దేవి అమ్మవారి దగ్గర సప్తశతి పారాయణం జరగాలని, దాని కోసం నిష్టగా ఉండాలని ఆది శంకరాచార్యులు సూచించారని ఆయన తెలిపా రు. ఈసంప్రదాయ ప్రకారమే అయిత చండీయాగం కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. మూడవ రోజు కార్యక్రమంలో మంత్రి తన్నీరు హరీశ్‌రావు, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఐటి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కెటిఆర్, హోమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, అటవీ శాఖ మంత్రి జోగు రామన్న, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి చందూలాల్, తెలంగాణ శాసన మం డలి చైర్మన్ స్వామిగౌడ్, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్, బోయిని వినోద్‌కుమార్, ఎమ్మెల్సీ భాను ప్రసాద్, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, ఏనుగు రవీందర్‌రెడ్డి, చిలుకూరి బాలాజి ఆల యం చైర్మన్ సౌందర్య రాజన్, రాజ్యసభ సభ్యులు ఆనంద్‌భాస్కర్ తదితరులు చండీయాగంలో పాల్గొని పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం నుంచే కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రజలు రావడంతో ఎర్రవల్లి దారులన్నీ రద్దీగా మారాయి. ఒకవైపు చండీ మాత విగ్ర హం ఎదురుగా ములుగు మండలం గంగాపూర్ నుంచి వచ్చే రెండు దారులు, తర్వాత వర్ధరాజ్‌పూర్ నుంచి, జగదేవ్‌పూర్ నుంచి వచ్చే దారులన్నీ కిలోమీట ర్ల దూరంలో ట్రాఫిక్ నిలిచిపోయింది. అక్కడి నుండి కేవలం ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న చండీయాగ స్థలికి రావడానికి గంటల సమయం పట్టింది. ట్రాఫిక్ క్లియర్ చేయడానికి పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. యాగస్థలి సమీపం నుంచి యాగం వద్దకు వెళ్లడానికి ఉన్న నాలుగు దారులు రద్దీగా మారాయి. ఉదయాన్నే కుంకుమార్చనకు వేల సంఖ్యలో మహిళలు హా జరవడంతో వారు కార్యక్రమంలో గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చింది. గంట పాటు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడటంతో ఇరు వైపులా ప్రజలను నిలిపివేశారు. భోజన శాల వద్ద రద్దీ బాగాపెరిగిది. భోజనం కోసం భక్తులు గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చింది. వివిఐపిల మార్గంలో సైతం పెద్ద ఎత్తున తరలిరావడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఉదయం నుండి సాయంత్రం వరకు ట్రాఫిక్ సమస్య కొనసాగింది. హైదరాబాద్ వెళ్లే ప్రజలను ఇటిక్యాల నుండి అలిరాజ్‌పేట మీదుగా తరలించారు. నాలుగో రోజు అయుత చండీ మహా యాగంకు భక్తులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశాలున్నాయి. ఈమేరకు పోలీసులు, సిబ్బంది ముందస్తు చర్యలు చేపడుతున్నారు.
మహాయాగంలో నేడు …
ఉదయం గురు ప్రార్థన, గణపతి పూజ, ఏకాదశ న్యాస పూర్వక చతుస్స హస్ర చండీ పారాయణములు, నవావరణ పూజలు, సప్త ద్రవ్య మృత్యుంజయ హోమం, మహా సౌరము, ఊక్తదేవతా జపములు, కుమారి, సువాసినీ, దంపతీ పూజ, మహా మంగళ హారతి, విశేష నమస్కార ములు, తీర్థ ప్రసాద వితరణ ములు, మద్యాహ్నం మూడు నుండి ధార్మక ప్రవచ నాలు, పూజలు
ఉంటాయి.