Home తాజా వార్తలు రోడ్డు ప్రమాదంలో అయ్యప్ప భక్తుడు మృతి

రోడ్డు ప్రమాదంలో అయ్యప్ప భక్తుడు మృతి

Ayyappa devotee

 

రంగారెడ్డి : ఆటోడ్రైవర్ అతివేగం, అజాగ్రత్తగా నడుపుతూ ద్విచక్రవాహనంను ఢీకొట్టడంతో ఈప్రమాదంలో అయ్యప్ప భక్తుడు అక్కడికక్కడే మ్పతి చెందిన సంఘట చేవెళ్ల మండల పరిధిలోని అంతారం స్టేజీ సమీపంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కౌకుంట్ల గ్రామానికి చెందిన మిట్టెకాడి రాములు కుమారుడు వెంకటేష్‌ముదిరాజ్(18) ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. గత కొన్ని రోజుల క్రితం అయ్యప్ప మాల ధరించి చేవెళ్ల సన్నిదానంలో ఉంటున్నాడు.

శనివారం కౌకుంట్ల గ్రామానికి వెళ్లి రాత్రి ద్విచక్రవాహనం(ఏపీ10ఏపీ6106)పై చేవెళ్లకు వస్తుండగా అంతారం గ్రామం దాటిన తర్వాత చిట్టెంపల్లి స్టేజ్ సమీపంలో ఎదురుగా ఆటో డ్రైవర్ (టీఎస్34సీ0021) అతివేగం, అజాగ్రత్తగా నడుపుతూ ద్విచక్రవాహనంను ఢీకొట్డాడు. ఈప్రమాదంలో వెంకటేష్ కుడి కాలు విరగడంతో పాటు తీవ్ర రక్తగాయాలై అక్కడికక్కడే మ్పతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Ayyappa devotee Died in road accident