Home ఆంధ్రప్రదేశ్ వార్తలు అయ్యప్ప భక్తులు బస్సు బోల్తా: 10 మందికి గాయాలు

అయ్యప్ప భక్తులు బస్సు బోల్తా: 10 మందికి గాయాలు

Bus Accident At Chittoorచిత్తూరు: జిల్లాలోని మదనపల్లె బైపాస్ రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున అయ్యప్ప భక్తులు ప్రయాణిస్తున్న బస్సు బోల్తాపడింది. ప్రమాద సమయంలో బస్సులో 10 మంది అయ్యప్ప భక్తులకి  తీవ్రంగా గాయలయ్యాయి. శబరిమల నుంచి తిరిగి వస్తుండగా ఈ ప్రమాద ఘటన జరిగింది. క్షతగాత్రులను స్థానికలు మదనపల్లె సర్కార్ దవాఖానకు తరలించారు. ప్రమాద సమయంలో 40 మంది బస్సులో ఉన్నట్లు సమాచారం. బాధితులు అనంతపురం జిల్లా ఓబులదేవరచెరువు మండలం దాదిరెడ్డిపల్లి వాసులుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న  పోలీసులు విచారణ చేపట్టారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న అయ్యప్ప భక్తుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు వెల్లడించారు.

Ayyappa Devotees Bus Accident At Chittoor District