Friday, April 19, 2024

అవినీతిని అడ్డుకున్నందుకే నోటీసులు

- Advertisement -
- Advertisement -

Azharuddin reacts on Apex Council notice

మన తెలంగాణ/హైదరాబాద్: తనను హైదరాబా ద్ క్రికెట్ సంఘం అధ్యక్ష పదవి నుంచి తప్పిస్తూ అపెక్స్ కౌన్సిల్ జారీ చేసిన నోటీసులపై హెచ్‌సిఎ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్ ఘాటుగా స్పందించారు. అసోసియేషన్‌లోని కొందరి అవినీతిని తాను అడ్డుకున్నానని, దీనికి ప్రతీకారంగా కొందరు అపె క్స్ కమిటీ సభ్యులు తనను అధ్యక్ష పదవి నుంచి తప్పిస్తూ నోటీసులు జారీ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్దేశ పూర్వకంగానే తనకు నోటీసులు ఇచ్చారని, హెచ్‌సిఎ గౌరవానికి భంగం కలిగేలా తానెప్పుడూ పని చేయలేదని అజారుద్దీన్ స్పష్టం చేశారు. అపెక్స్ కమిటీలో తొమ్మిది మంది సభ్యు లు ఉంటే వారిలో ఐదుగురు ఓ వర్గంగా ఏర్పడి తాము చేసిందే శాసనం అని ప్రకటిస్తే ఒప్పుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. హెచ్‌సిఎలో జరుగుతున్న అవినీతిని అరికట్టడానికి సమర్థమైన వ్యక్తిని అంబుడ్స్‌మెన్‌గా నియమిస్తే ఆ ఐదుగురే తప్పుపట్టారని అజారుద్దీన్ వివరించారు. వాళ్ల అవినీతి బయటపడుతుందనే అలా చేశారని ఆరోపించారు. ఇక కొందరూ ఓ వర్గంగా ఏర్పటి హెచ్‌సిఎ రాజ్యం గాన్ని ఖూనీ చేస్తున్నారని, అడ్డుకోవాలని చూస్తు న్న తనపై బురద చల్లుతున్నారని వాపోయారు. అపెక్స్ కౌన్సిల్ సభ్యులు జాన్ మనోజ్, విజయానంద్, నరేశ్ శర్మ, సురేందర్ అగర్వాల్, అనురాధ పై అవినీతి ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు. వాళ్ల అవినీతిని తాను అడ్డుకోవడంతోనే తనపై కక్ష కట్టి ఇలాంటి నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. దశాబ్దాలుగా హెచ్‌సిఎలో పాతుకు పోయి న కొందరూ సభ్యులు ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారని, అవి బయటపడతాయనే భయంతోనే తన ను హెచ్‌సిఎ అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తున్నట్టు నోటీసులు జారీ చేశారన్నారు. ఈ నోటీసులకు తాను భయపడేది లేదని స్పష్టం చేశారు. ఇక నిజానికి అపెక్స్ కౌన్సిల్ సభ్యులకు ఎవరినీ నిషేదించే హక్కులేదని, అలాగే నోటీసులు ఇచ్చే అధికారం లేదన్నారు. అంతేగాక మెజారిటీ లేకుండా సమావేశాలు ఎలా నిర్వహిస్తారని, ఆ ఐదుగురు చెప్పిందే అపెక్స్ కౌన్సిల్ నిర్ణయంగా భావిస్తే ఎలా అని అజారుద్దీన్ ప్రశ్నించారు. తనకు నోటీసులు జారీ చేసిన వారిపై ఎన్నో అవినీతి ఆరోపణలు ఉన్నాయ ని, వాటినుంచి తప్పించుకునేందుకే ఇలాంటి చర్య లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. హైకోర్టు ఉత్తర్వులనూ కూడా వారు పట్టించుకోక పోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఇక ఇలాంటి వారి బెదిరింపులకు తాను లొంగే ప్రసక్తేలేదని అజారుద్దీన్ తేల్చి చెప్పారు.

Azharuddin reacts on Apex Council notice

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News