Home కరీంనగర్ వేధింపులు తాళలేక బిటెక్ విద్యార్ధి ఆత్మహత్య

వేధింపులు తాళలేక బిటెక్ విద్యార్ధి ఆత్మహత్య

Suicideకరీంనగర్: వేధింపులు తాళలేక బిటెక్ విద్యార్ధీనీ బండారి శ్రీలత రైలు క్రిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే జిఆర్‌పియఫ్ ఎస్సై ఎల్లయ్య,గ్రామస్ధులు తెలిపారు.వారు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని ఉప్పల్ గ్రామంనకు చెందిన బండారి శ్రీలత (21) అనే యువతి బిటెక్ పూర్తి చేసి బ్యాంక్ ఉద్యోగ పరీక్షలకై హన్మకొండకు కోచింగ్ వెలుతోంది. కాగా శ్రీలత మంగళవారం ఉదయం ఇంటి నుండి వెళ్ళి ఎంతకు తిరిగిరాకపోవడంతో తల్లిదండ్రులు స్ధానిక పోలీస్ స్టేషన్‌లో 15న ఫిర్యాదు చేశారు.అచూకి కోసం వెతుకుతున్న క్రమంలో గురువారం వరంగల్ జిల్లా ఖాజీపేట ఫాతీమానగర్ వద్ద రైలు క్రింద పడి ఆత్మహత్య చేసుకుందని తెలిపారు.శ్రీలత ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలను తన సూసైడ్ నోట్‌లో పోందుపరిచిందని,గ్రామంనకు చెందిన రాకేష్ అనే యువకుడు ప్రేమించి మోసం చేయడంతో పాటు విజయ అనే యువతి వేధింపులే కారణమంటూ తల్లిదండ్రులు మన్నించాలంటూ తనువుచాలించిందని వారు తెలిపారు.కాగా తండ్రి బండారి భద్రయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీస్‌లు తెలిపారు. సంఘటన స్ధానికులను కలచివేయగా కుటుంబ సభ్యులు దుఃఖసాగరంలో మునిగిపోయారు.