Home తాజా వార్తలు ‘బాఘీ 3’ ట్రైలర్.. అబ్బురపరిచే హై ఓల్టేజ్ యాక్షన్..

‘బాఘీ 3’ ట్రైలర్.. అబ్బురపరిచే హై ఓల్టేజ్ యాక్షన్..

 

‘వార్’ సినిమాతో ఆలరించిన బాలీవుడ్ యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ తాజాగా నటిస్తున్న చిత్రం ‘భాఘీ 3’. ‘వార్’ సినిమాలో స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి టైగర్ ష్రాఫ్ యాక్షన్ సీన్స్ లో అదరగొట్టాడు. అంతకుముందు ‘భాఘీ 2’ సినిమాతో ఘన విజయాన్ని అందుకున్న టైగర్.. ఇప్పుడు మరోసారి యాక్షన్ సినిమాతోనే వస్తున్నాడు. అన్నదమ్ముల అనుబంధంతో అహ్మద్ ఖాన్ దర్శకత్వంలో ‘భాఘీ 3’ సినిమా రూపొందుతుంది. సాజిద్ నడియావాలా నిర్మిస్తున్న ఈ సినిమాలో టైగర్ కు జోడీగా శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో టైగర్ చేసిన యాక్షన్స్ చూసి వావ్ అనకుండా ఉండలేమనేంతగా అద్భుతంగా తెరకెక్కించారు. ఇప్పటి వరకూ ఇండియన్ సినిమాలో ఇటువంటి యాక్షన్ సీన్స్ చూసుండరని చెప్పొచ్చు. కాగా, ఈ సినిమాని మార్చి 6వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

BAAGHI 3 Movie Trailer Released