Home కరీంనగర్ బాహుబలి ఆరో మోటార్ వెట్ రన్ విజయవంతం

బాహుబలి ఆరో మోటార్ వెట్ రన్ విజయవంతం

wet Run

 

రామడుగు : కాళేశ్వరం ప్రాజెక్టు 8వ ప్యాకేజీలోని బాహుబలి మోటారు వెట్ రన్ ను బుధవారం అధికారులు విజయవంతంగా నిర్వహించారు. రామడుగు మండలం లక్ష్మీపూర్ గ్రామంలో గల గాయత్రి పంప్‌హౌజ్‌లోని 6వ బాహుబలి మోటార్‌ను బుధవారం వెట్ రన్ విజయవంతంగా కాగా గత ఆగస్టు నెలలో బాహుబలి మోటార్లు 1, 2, 4, 5వ మోటార్లను వెట్ రన్ విజయవంతం చేసి పంప్‌హౌజ్‌ల ద్వారా నీటిని ఎత్తిపోసి గ్రావిటీ కాలువలోకి అనంతరం వరద కాలువ ద్వారా మిడ్‌మానేరుకు 15 టిఎంసిల నీటిని తరలించారు.

అనంతరం ఎస్‌ఆర్‌ఎస్‌పి ప్రాజెక్టు పునరుజ్జీవ పథకంలో భాగంగా కాళేశ్వరం జలాలను రివర్స్ పంపింగ్ ద్వారా శ్రీరాములపల్లి క్రస్ట్ గేట్ల వద్ద గేట్లను వేసి శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి రివర్స్ పంపింగ్ ద్వారా పంపిస్తున్నారు. కాగా గత వారం రోజుల క్రితం నుండి నీటిని నిలిపి వేసిన అధికారులు ఎట్టకేలకు బాహుబలి ఆరవ మోటార్‌ను బుధవారం వెట్ రన్ ద్వారా విజయవంతం చేశారు. విజయవంతం చేసిన అనంతరం కొద్ది గంటలలోనే మోటార్లను నిలిపి వేయనున్నట్లు సాగునీటి శాఖ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సాగునీటి రంగ నిపుణుడు పెంటారెడ్డి, ఈఎంసి నల్ల వెంకటేశ్వర్లు, డీఈ శ్రీధర్, రమేష్, సురేష్, మెగా కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.

Baahubali Sixth Motor wet Run Successful