Wednesday, April 24, 2024

లోక్‌సభ సభ్యత్వానికి బాబుల్ సుప్రియో రాజీనామా

- Advertisement -
- Advertisement -

Babul Supriyo resigns from Lok Sabha

 

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్‌లో చేరేందుకు గత నెల బిజెపిని వీడిన బాబుల్ సుప్రియో మంగళవారం తన పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన పట్ల నమ్మకం చూపినందుకు ఆయన బిజెపి నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు. బిజెపితో తన రాజకీయ జీవితం ప్రారంభమైందని, తన పట్ల నమ్మకం చూపిన ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షాకు ధన్యవాదాలని ఆయన తెలిపారు. పార్టీలో కొనసాగనందున తాను ఎంపి పదవికి రాజీనామా చేస్తున్నానని ఆయన తెలిపారు. తన రాజీనామా లేఖను ఆయన లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు అందచేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News