Home ఆంధ్రప్రదేశ్ వార్తలు అట్టపెట్టెలో మగ పసికందు మృతదేహం

అట్టపెట్టెలో మగ పసికందు మృతదేహం

Baby

అమరావతి: విజయనగరంలోని ట్యాంక్‌బండ్ ప్రాంతంలో అట్టపెట్టెలో మగ పసికందు మృతదేహం కనిపించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. అట్టపెట్టెలో పసికందు మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అటపెట్టెలో ఉన్న మృతదేహాన్ని మగ పిల్లవాడిగా గుర్తించారు. ఈ పసికందును చంపేసి ఇక్కడ పడేశారా? లేదా బతికి ఉన్న పసికందును ఇక్కడ వదిలేశారా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి సిసి కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ కిరణ్ కుమార్ తెలిపారు.

 

Baby Dead Body Found in Paper Box in Vijayanagaram