Home తాజా వార్తలు ప్రభాస్‌ను బ్యాడ్ బాయ్ అంటున్న జాక్వెలిన్

ప్రభాస్‌ను బ్యాడ్ బాయ్ అంటున్న జాక్వెలిన్

 

హైదరాబాద్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘సాహో’ ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా తెరకెక్కింది. ఈ మూవీని యూవీ క్రియేషన్స్ 300 కోట్ల బడ్జెట్ తో అత్యంత భారీ ఎత్తున నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలు, టీజర్, ట్రైలర్‌కు భారీ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి బ్యాడ్ బాయ్ అంటూ కొత్త సాంగ్‌ను రిలీజ్ చేసారు. ఈ పాట హాలీవుడ్ రేంజ్లో ఉందంటూ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ పాటలో బాలీవుడ్ అందాల భామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌తో ప్రభాస్ ఆడిపాడుతూ స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. ఇక, నిన్న రామోజీ ఫిల్మీ సిటీలో భారీ లెవల్లో ఈ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుక జరిగింది. దీంతో సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న బజ్ అమాంతం పెరిగింది. ఈ సినిమాను ఎప్పుడెప్పడు చూధ్దామా అని అభిమానులతో పాటు సినీ ప్రముఖలు ఎదురు చూస్తున్నారు.

యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహించిన ‘సాహో’ సినిమాను తెలుగుతోపాటు తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన శ్రద్దా కపూర్ హీరోయిన్‌గా నటించింది. ఆగష్టు 30న ప్రపంచవ్యాప్తంగా ‘సాహో’ గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సినిమాతో ప్రభాస్ ఎన్ని రికార్డులు సృష్టిస్తాడో చూడాలి మరి.

Bad Boy song out from Saaho, The third song of Prabhas and Shraddha Kappor’s Saaho has been released