Home తాజా వార్తలు బ్యాడ్మింటన్ అకాడమీని ప్రారంభించిన కెటిఆర్

బ్యాడ్మింటన్ అకాడమీని ప్రారంభించిన కెటిఆర్

ktrహైదరాబాద్ : బ్యాడ్మింటన్ క్రీడాకారులకు హైదరాబాద్‌లో మరో అకాడమీ అందుబాటులోకి వచ్చింది. గచ్చిబౌలిలో కొత్తగా నిర్మించిన జాతీయస్థాయి బ్యాడ్మింటన్ అకాడమీని తెలంగాణ మంత్రి, తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు కెటిఆర్ మంగళవారం ప్రారంభించారు. భారత క్రీడా ప్రాధికారిక సంస్థ, పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ సంయుక్తంగా దీనిని నిర్మించాయి. ఎకరా స్థలంలో నిర్మించిన ఈ అకాడమీలో తొమ్మిది కోర్టులతో పాటు క్రీడాకారులకు అవసరమైన అధునాతన సౌకర్యాలను కల్పించారు. సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీ.వీ.ఆనంద్ అకాడమీని సందర్శించి కాసేపు బ్యాడ్మింటన్ ఆడారు