Friday, April 26, 2024

బహదూర్‌పుర కానిస్టేబుల్ సస్పెండ్

- Advertisement -
- Advertisement -

Bahadurpura Constable Suspended by Cp anjani kumar

మద్యం తాగి పట్టుబడ్డ పిసి
సస్పెండ్ చేసిన నగర సిపి అంజనీకుమార్

మనతెలంగాణ, హైదరాబాద్ : డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేస్తూ నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. నగరంలోని బహదూర్‌పుర పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న వెంకటేష్ మద్యం తాగి వాహనం నడిపాడు. రాజేంద్రనగర్ పోలీసులు మంగళవారం రాత్రి చేపట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో వెంకటేష్‌కు బ్రీత్ టెస్ట్ చేయగా మద్యం తాగినట్లు తెలిసింది. వెంటనే వాహనాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలియడంతో మద్యం తాగి బైక్‌ను నడుపుకుంటూ వెళ్లిన కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేస్తూ సిపి అంజనీకుమార ఉత్తర్వులు జారీ చేశారు. బాధత్య గల విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు చట్టనాకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే చర్యలు తప్పవని సిపి పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News