Tuesday, February 7, 2023

ఎప్రిల్ 28 న బాహుబలి 2 రిలీజ్…!!

- Advertisement -

bahubali 2 to release on april 28

2015 లో ప్రపంచ వ్యాప్తంగా చాలా భాషల్లో రిలీజ్ అయి సుమారు రూ. 600 కోట్లు కలెక్ట్ చేసిన బాహుబలి మూవీ కి కొనసాగింపు గా వస్తున్న బాహుబలి 2 రిలీజ్ గురించి మూవీ యూనిట్ తెలియజేసింది.

ఇండియా టుడే కన్ క్లేవ్ సమ్మిట్ 2017 లో బాహుబలి టీమ్ పాల్గొంది. ఈ సందర్భంగా బాహుబలి 2 మూవీ గురించి సమ్మిట్ లో వివరించారు బాహుబలి డైరెక్టర్ రాజమౌళి. ఎప్రిల్ 28 న మూవీ రిలీజవనున్నట్లు ప్రకటించారు రాజమౌళి. బాహుబలి ఫస్ట్ పార్ట్ కంటే కూడా బాహుబలి 2 చాలా బాగుంటుందని వివరించింది మూవీ యూనిట్.

బాహుబలి ఫస్ట్ పార్ట్ లో దొర్లిన చిన్న చిన్న తప్పులను సవరించి పర్ ఫెక్ట్ విజువల్స్ తో వండర్ మూవీగా రూపొందిస్తున్నట్లు మూవీ యూనిట్ తెలియజేసింది. అయితే, జనవరి 26, 2017 నే మూవీ టీజర్ రిలీజ్ కావలసి ఉండగా… వీఎఫ్ఎక్స్ వర్క్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లేట్ అవడం వల్ల టీజర్ లాంచ్ పోస్ట్ ఫోన్ చేశారు.

గత సంవత్సరం అక్టోబర్ లో రిలీజయిన బాహుబలి 2 ఫస్ట్ లుక్… బాహుబలి కంటే బాహుబలి 2 పైనే ఎక్కువ అంచనాలను పెంచేసింది. ఇక, ఫిబ్రవరి లో బాహుబలి 2 టీజర్ ను లాంచ్ చేయడానికి మూవీ యూనిట్ రెడీ గా ఉన్నట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles