Home తాజా వార్తలు గాయత్రి టు మిడ్ మానేరు

గాయత్రి టు మిడ్ మానేరు

Bahubali pumps get ready for wet run

 

మన తెలంగాణ/కరీంనగర్ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టులోని అతి పెద్ద పంప్‌హౌజ్ అయిన గాయత్రిలోని బాహుబలి 4, 5వ మోటార్లకు అధికారులు వెట్న్ నిర్వహిస్తుండటంతో మోటార్లు ఎత్తిపోస్తున్న నీళ్లు గ్రావిటీ కెనాల్ ద్వారా మిడ్ మానేరు చేరుకుంటోంది. గాయత్రి పంప్‌హౌజ్‌లో 7 మోటార్లు ఉండగా ఇప్పటికే అధికారులు రెండు మోటార్లకు వెట్న్ దిగ్విజయంగా నిర్వహించారు. మరో రెండు మోటార్లకు వెట్న్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే ఎల్లంపల్లి ద్వారా నందికి చేరుకునున్న గోదావరి నీటిని అధికారులు పంపింగ్ ద్వారా ఎత్తిపోసి గాయత్రి పంప్‌హౌజ్‌లకు తరలిస్తున్నారు. దీంతో అధికారులు గాయత్రి వద్ద గల బాహుబలి మోటార్లను వెట్న్‌ల్రు నిర్వహిస్తూ కాళేశ్వరం జలాలను గ్రావిటీ కెనాల్ ద్వారా మిడ్ మానేరుకు పంపుతున్నారు.

రాంపూర్ జంక్షన్‌కు చేరిన గోదావరి
బాహుబలి మోటార్ల ద్వారా గ్రావిటీ కెనాల్‌లో ఎత్తిపోసే గంగాజలాన్ని జంక్షన్ పాయింట్ వద్ద ఇటు మిడ్‌మానేరుకు, ఇంకోవైపు ఎస్‌ఆర్‌ఎస్‌సి పునరుజ్జీవ పథకం క్రింద శ్రీరాంసాగర్‌కు గోదావరి జలాలను తరలించనున్నారు. ఇప్పటికీ రాంపూర్ జంక్షన్ పాయింట్ వద్దకు గోదావరి జలాలు చేరాయి. గాయత్రి పంప్‌హౌజ్ వద్ద బాహుబలి మోటార్లన్నీ ఒకేసారి ఎత్తిపోయడం ప్రారంభమైతే మిడ్‌మానేరుతో పాటు మానేరు డ్యాం సైతం ఈ నెలలోనే నిండుకుండలా మారనుంది.

పంప్‌హౌజ్‌ల పరిశీలనకు సిఎం రాక
రెండు మూడు రోజుల్లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ గాయత్రి వద్దకు, రాంపూర్ పంప్‌హౌజ్‌ల పరిశీలన జరిపేందుకు జిల్లాకు రానున్నారు. సిఎం రాక సందర్భంగా ఇప్పటికే అధికారులు ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ పరిశీలన అనంతరం గాయత్రి పంప్‌హౌజ్‌ల నుండి మిడ్‌మానేరుకు నీటిని నిరంతరాయంగా ఎత్తిపోయనున్నారు. ప్రతినిత్యం ప్రగతిభవన్ నుండి ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యవేక్షిస్తూ అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలు జారీ చేస్తున్నారు.

Bahubali pumps get ready for wet run