Home తాజా వార్తలు మార్కెట్లోకి కొత్త బజాజ్ సిటి 110…

మార్కెట్లోకి కొత్త బజాజ్ సిటి 110…

Bajaj City 110 bike

 

న్యూఢిల్లీ : ద్విచక్రవాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో కొత్త బజాజ్ సిటి110 బైక్ దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. దీనిలో కిక్‌స్టార్ట్ వేరియంట్ ధర రూ. 37,997, ఎలక్ట్రిక్ వెర్షన్ ధర రూ. 44,480(ఎక్స్ షోరూం ఢిల్లీ)గా ఉంది. ఈ మోడల్ మ్యాటీ ఆలివ్‌గ్రీన్ విత్ ఎల్లో డెకాల్స్, గ్లోస్ ఎబోనీ బ్లాక్ విత్ బ్లూ డెకాల్స్, గ్లోస్ ఫ్లేమ్ రెడ్ విత్ బ్రైట్ రెడ్ రంగుల్లో అందుబాటులో ఉందని సంస్థ వెల్లడించింది.

గ్రామీణ ప్రాంతాల్లో వాణిజ్య విస్తరణకు గాను ఈ మోడల్‌ను రూపొందించినట్లు సంస్థ ప్రకటించింది. కొత్త సిటి 110 ను సరిగ్గాలేని రోడ్లపై కూడా నడిచే విధంగా డిజైన్ చేసినట్లు కంపెనీ తెలిపింది. దీనిలో 115 సిసి ఇంజన్ ఉంటుందని పేర్కొంది. సరసమైన ధరలకు మంచి బైక్‌లను కోరుకునే వినియోగదారులకు సరైన బైక్ సిటి కేటగిరీ, కంపెనీ ఇప్పటివరకు సిటి కేటగిరీలో 50 లక్షలకు పైగా యూనిట్లను విక్రయించిందని బజాజ్ మోటార్‌సైకిల్ (వాణిజ్యం) అధ్యక్షుడు సరాంగ్ కనడె తెలిపారు.

Bajaj Auto has launched Bajaj City 110 bike to market