Tuesday, March 28, 2023

బాలయ్య ఓ సూపర్ హీరో

- Advertisement -

‘అఖండ’ ఫైట్ మాస్టర్ స్టంట్ శివ్

Balaiah is super hero

 

నటసింహా నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందిన హ్యాట్రిక్ మూవీ అఖండ. చిత్రం ఇటీవల విడుదలై భారీ కలెక్షన్లు సాధిస్తుంది. ఈ సందర్భంగా ఈ సినిమా సక్సెస్‌ను ఫైట్ మాస్టర్ స్టంట్ శివ, ఆయన కుమారులు కెవిన్, స్టీవెన్ మీడియాతో పంచుకున్నారు. ఈ సందర్భంగా స్టం ట్ శివ మాట్లాడుతూ ‘అఖండ’ సినిమాలో అఘోర ఎంట్రీ నుంచి క్లైమాక్స్ వరకు నేను ఫైట్స్ కంపోజ్ చేశాను.

ఈ ఫైట్స్ ఇంత బా గా రావడానికి బోయపాటి శ్రీను గారు, బాలకృష్ణ కారణం. ప్రతీ సినిమాకు కూడా బాగా ఫైట్స్ కంపోజ్ చేస్తాం, అవార్డులు రావా లనే చేస్తాం. ఆ హీరో ఆ మూడ్‌లోకి వచ్చి మాస్టర్ చెప్పినట్టుగా చేస్తే అది కుదురుతుంది. ఇక అఖండలో బాలయ్య అద్భుతంగా ఫైట్లు చేశారు. ఈ సినిమా కోసం 80 రోజులు పనిచేశాను. 60 నుంచి 65 రోజులు కేవలం యాక్షన్ సీక్వెన్స్ కోసమే చేశాను. తెలుగు ఇండస్ట్రీలో మాస్, మంచి యాక్షన్ సీక్వెన్స్ కోరుకుం టారు. ఆ తర్వాత అందులోనూ బాలయ్య అంటే వేరే లెవెల్ ఉండాలి. దీంతో ‘అఖండ’లో డిఫరెంట్‌గా ఫైట్లు డిజైన్ చేశాం. పవర్ ఉంది. ఇండియన్ సినిమాకు బాలయ్య ఓ సూపర్ హీరో. ఇక టాలీవుడ్‌లో నేను నటుడిగా బిజీ న్నాను. ‘ఎఫ్ 3’లో నేనే మెయిన్ విలన్. ‘క్రాక్’ తరువాత నటుడి గా ఆఫర్లు వస్తున్నాయి’ అని అన్నారు. ప్రస్తుతం బంగార్రాజు షూ టింగ్ జరుగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News