Friday, April 19, 2024

ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలు

- Advertisement -
- Advertisement -

Balakrishna Akhanda movie latest updates

మాస్ యాక్షన్ కథాంశాలను తెరకెక్కించడంలో బోయపాటి పనితనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. తన సినిమాల్లో భారీ యాక్షన్ ఎపిసోడ్స్‌తో అదరగొడతాడు ఈ దర్శకుడు. ఫ్యామిలీ సెంటిమెంట్‌ని జోడించి కలర్‌ఫుల్ ఫ్రేములను డిజైన్ చేయడంలోనూ ఆయనకు ఆయనే సాటి. ఈ నేపథ్యంలో దర్శకుడు బోయపాటి ‘అఖండ’లో భారీ ఫైట్స్‌ని ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలతో తెరకెక్కించాడని తెలిసింది. బాలయ్యను సింహా,- లెజెండ్ సినిమాల్లో ఎంత పవర్ ఫుల్‌గా చూపించాడో అంతకుమించి చూపించనున్నాడని సమాచారం.

బోయపాటి చాలా కాలం తర్వాత బాలయ్యను డైరెక్ట్ చేస్తున్నాడు. దీంతో ఎంతో జాగ్రత్తగా ఈ సినిమా స్క్రీన్‌ప్లేని మాస్ యాక్షన్ అంశాలతో గ్రిప్పింగ్‌గా తీర్చిదిద్దాడని తెలిసింది. ఈ చిత్రంలో మొత్తం ఎనిమిది ఫైట్స్ వేటికవే ప్రత్యేకంగా ఉంటాయి. వీటిలో డైరెక్టర్ బోయపాటి ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఇంటర్వెల్ బ్లాక్ అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇస్తుందట. బాలయ్య అభిమానులకు విజువల్ ఫీస్ట్‌ని అందించడమే ధ్యేయంగా ఆయన ప్రతి ఫైట్‌ను డిజైన్ చేశాడని తెలిసింది. ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ప్రగ్య అందచందాల ఎలివేషన్‌లోనూ బోయపాటి బృందం ఎక్కడా తగ్గలేదట. గగుర్పొడిచే యాక్షన్ విన్యాసాలు ఓవైపు.. ప్రగ్యతో బాలయ్య రొమాన్స్ ఇంకోవైపు అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇవ్వనున్నాయట.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News