Home సినిమా ముచ్చటగా మూడో చిత్రం షూటింగ్‌లో…

ముచ్చటగా మూడో చిత్రం షూటింగ్‌లో…

balaiah

నందమూరి బాలకృష్ణ హీరోగా కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో సికె ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై. లిమిటెడ్ పతాకంపై సి.కళ్యాణ్ ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల ప్రారంభమైన ఈ చిత్రంలో స్టార్ బ్యూటీ నయనతారను కథానాయికగా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. సోమవారం నుండి ఆమె ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌లో పాల్గొంటోంది.
మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం రెగ్యులర్ షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ “సింహా, శ్రీరామరాజ్యం వంటి బ్లాక్‌బస్టర్ హిట్స్ అనంతరం బాలకృష్ణ-నయనతార కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ఇది. ఆ సినిమాల స్థాయిలోనే ఈ సినిమాలో కూడా వారి మధ్య మంచి కెమిస్ట్రీ ఉంటుంది. ఈ హిట్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ మూడో సినిమాపై అభిమానులు, ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.
బాలకృష్ణ కెరీర్‌లోనే ఇది మరో సంచలన చిత్రమవుతుంది”అని అన్నారు. బ్రహ్మానందం, ప్రకాష్‌రాజ్, అశుతోష్ రాణా, మురళీమోహన్, బాహుబలి ప్రభాకర్, శివపార్వతి తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ భారీ చిత్రానికి కథ, మాటలుః ఎం.రత్నం, యాక్షన్‌ః అంబరీవ్, కెమెరాః సి.రాంప్రసాద్, సంగీతంః చిరంతన్ భట్, కో-ప్రొడ్యూసర్‌ః సి.వి.రావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌ః సి.తేజ, సి.వరుణ్‌కుమార్.