Friday, March 29, 2024

‘అఖండ’లో బాలయ్య అదరగొట్టేశారు

- Advertisement -
- Advertisement -

Balakrishna good act in Akhanda Movie

సీనియర్ స్టార్ నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రాబోతున్న హ్యాట్రిక్ మూవీ ‘అఖండ’ డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ద్వారకా క్రియేషన్స్‌పై ఈ చిత్రాన్ని మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ‘అఖండ’ ప్రమోషన్స్‌లో భాగంగా మ్యూజిక్ డైరక్టర్ తమన్ మీడియాతో మాట్లాడుతూ చెప్పిన విశేషాలు…
మా అందరినీ పరిగెత్తించారు…
బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల మధ్య అవగాహన చాలా గొప్ప ది. వారిద్దరూ కలిసి ఎన్ని వంద ల సినిమాలు చేసినా ఫ్లాప్ అవ్వ వు. ఇక బోయపాటి ఈ చిత్రాన్ని అద్భుతంగా మలిచారు. కరోనా వల్ల సినిమాలో మార్పులు వచ్చా యి. దీంతో కాలానికి తగ్గట్టుగా మార్చుకుంటూ వచ్చాను. విడుదలయ్యే టైమ్‌కు తగ్గట్టు మ్యూ జిక్ ఉండాలి. అందుకే మళ్లీ రీరికార్డింగ్ చేశాను. మంచి రేసుగుర్రంలా బోయపాటి పరిగెత్తారు. మా అందరినీ పరిగెత్తించారు.
పర్ఫెక్ట్ మీల్ లాంటి సినిమా…
ఈ సినిమాలో ఫైర్ ఉంది. ఇందులో ఎమోషన్ బాగుంటుంది. ఎమోషన్ బాగుంటే సినిమాలు ఎప్పుడూ హిట్ అవుతాయి. బాలయ్య అదరగొట్టేశారు. ఇది పర్ఫెక్ట్ మీల్ లాంటి సినిమా. ఇక నేను అఘోర పాత్రల మీద రీసెర్చ్ చేశాను. ఆ పాత్రలకు తగ్గట్టుగానే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కొట్టాం. ఈ కథ నెవ్వర్ బిఫోర్.. నెవ్వర్ అగైన్ అని కూడా చెప్పొచ్చు. టైటిల్ సాంగ్ విని బాలయ్య మెచ్చుకున్నారు.
నేను చేసిన పనిలో ఇదే బెస్ట్…
మా మ్యూజిక్‌ను జనాల్లోకి తీసుకెళ్లేదే హీరోలు. ఈ చిత్రంలో బోర్ కొట్టే సీన్స్ ఉండవు. థియేటర్లో అందరూ ఎంజాయ్ చేస్తారు. ఇప్పటి వరకు నేను చేసిన పనిలో ఇదే బెస్ట్ అని అనిపిస్తుంది. ఈ సినిమాకు దాదాపు ఐదారు వందల మంది పని చేశారు. చాలా ప్రయోగాలు చేశాం. కేవలం సింగర్లే 120 మంది వరకు ఉంటారు. సినిమాలో అఘోర పాత్ర ఎంట్రీ ఇవ్వడంతో రేంజ్ మారిపోతోంది. వేరే జోన్‌లో ఉంటుంది. టైటిల్ సాంగ్‌ను కంపోజ్ చేసేందుకు దాదాపు ఓ నెల రోజులు పట్టింది. గొప్ప సన్నివేశం తరువాత ఆ పాట వస్తుంది.
లవ్లీ పర్సన్…
బాలయ్యతో తదుపరి చిత్రాన్ని కూడా చేస్తున్నాను. ఆయన సైన్స్‌ను నమ్మే వ్యక్తి. టైమ్‌ను ఎక్కువగా నమ్ముతారు. ఎంతో లవ్లీ పర్సన్. ఇక నిర్మాత చాలా మంచివారు. ఎక్కడ ఎంత ఖర్చు పెట్టాలో తెలిసిన వారు. ద్వారక క్రియేషన్స్‌లో పని చేయడం చాలా ఆనందంగా ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News