Wednesday, April 24, 2024

బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు.. టాలీవుడ్‌లో దుమారం

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: అగ్ర నటుడు బాలకృష్ణ కామెంట్లు టాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తున్నాయి. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో టాలీవుడ్ పెద్దలు భూములు పంచుకుంటున్నారని.. కొద్దిరోజుల కిందట చిరంజీవి ఇంట్లో జరిగిన మీటింగ్‌పై బాలయ్య సంచలన కామెంట్లు చేశాడు. దీంతో బాలకృష్ణ వ్యాఖ్యలపై పలువురు సినీ ప్రముఖులు మండిపడుతున్నారు.బాలయ్య కామెంట్లపై తాజాగా నిర్మాత సి కళ్యాణ్, మంత్రి తలసాని స్పందించారు.

తెలంగాణలో సినిమా షూటింగ్‌లకు అనుమతి ఇచ్చామని, సిఎం కెసిఆర్ కు నివేదిక ఇస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బాలయ్య ఎందుకు అలా అన్నాడో కనుక్కుని మాట్లాడతానని, మీటింగ్‌కు ఎవరిని పిలవాలనేది సినిమావాళ్ల ఇష్టమని, యాక్టివ్‌గా ఉన్నవాళ్లని పిలిచారని మంత్రి తలసాని అన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారని బాలయ్య అనడం సరికాదని నిర్మాత సి.కళ్యాణ్ అన్నారు. సమస్యలపై స్పందించాలని అనుకుంటే బాలయ్యే రావాలని కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ రోజు కూడా మరోసారి తలసానితో టాలీవుడు ప్రముఖులు చర్చలు జరిపారు.

Balakrishna Sensational Comments over Tollywood Meeting

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News