Thursday, April 18, 2024

లైన్‌లో రెండు కామెడీ సినిమాలు..!

- Advertisement -
- Advertisement -

Balakrishna to star in Anil Ravipudi Movie?

సీనియర్ స్టార్ నందమూరి బాలకృష్ణ ఈమధ్య కాలంలో సినిమాల ఎంపిక విషయంలో కాస్త ఎక్కువ శ్రద్ధ పెడుతున్నట్లుగా అనిపిస్తోంది. గతంలో ఆయన భారీ యాక్షన్ సినిమాలను మాత్రమే చేయాలని భావించేవాడు. కానీ ఈమధ్య కాలంలో కాస్త విభిన్నమైన స్క్రిప్ట్‌లను ఎంపిక చేసుకోవాలని భావిస్తున్నాడు. అందులో భాగంగానే ఇప్పటికే కొన్ని విభిన్నమైన సినిమాలను చేశాడు. ఇక బాలకృష్ణ మరిన్ని ప్రయోగాత్మక సినిమాలు చేయాలని భావిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం బాలయ్య త్వరలో రెండు కామెడీ చిత్రాలు చేయబోతున్నాడట. అనీల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ సినిమా ఉంటుందని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా కామెడీ ఎంటర్‌టైనర్‌గా బాలయ్య మాస్ ఇమేజ్‌కు తగ్గట్లుగా కూడా ఉంటుందని అంటున్నారు.

ఇక బాలయ్య మరో కొత్త సినిమాను వెంకీ కుడుముల దర్శకత్వంలో చేసేందుకు ఓకే చెప్పాడని తెలిసింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో బాలకృష్ణ ఒక సినిమా చేయాల్సి ఉంది. ఈ సినిమాకు వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తాడట. కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రాలను తెరకెక్కించడంలో వెంకీ కుడుములకు మంచి పేరు ఉంది. కనుక బాలయ్యను మంచి పాత్రలో ఆయన చూపించడంతో పాటు నవ్విస్తాడనే నమ్మకాన్ని ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. బాలకృష్ణ ప్రస్తుతం చేస్తున్న బోయపాటి సినిమా అఖండ తుది దశకు చేరుకుంది. ఒకటి రెండు వారాల్లో సినిమాకు గుమ్మడి కాయ కొట్టబోతున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమాను చేయబోతున్నాడు. ఇప్పటికే షూటింగ్ కార్యక్రమాల కోసం దర్శకుడు గోపీచంద్ మలినేని ఏర్పాట్లు చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత బాలయ్య చేయబోతున్న కామెడీ సినిమాలు చాలా స్పెషల్ గా ఉంటాయని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

Balakrishna to star in Anil Ravipudi Movie?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News