Friday, March 29, 2024

బాలయ్య, బోయపాటి కాంబినేషన్ లో ‘గాడ్ ఫాదర్’?

- Advertisement -
- Advertisement -

నందమూరి నటసింహం బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో హ్యాట్రిక్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇంకా ఈ సినిమాకు టైటిల్ పెట్టలేదు. అయితే, తాజాగా ఈ సినిమా టైటిల్‌ను ప్రకటించడానికి ముహూర్తం ఖరారు చేశారు చిత్రయూనిట్. ఉగాది సందర్భంగా ఏప్రిల్ 13వ తేదీన మధ్యాహ్నం 12 గంటల 33 నిముషాలకు ఈ సినిమా టైటిల్‌ను ప్రకటిస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ఒక పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమా టైటిల్‌పై మాత్రం ఇప్పటికే అనేక పేర్లు వచ్చాయి. అందులో ప్రధానంగా ‘మోనార్క్’ అనే టైటిల్ బాగా వినిపిస్తోంది. ఆ తరువాత ‘గాడ్ ఫాదర్’ అనే మరో టైటిల్ కూడా బాగా వినిపించింది. కాగా కథకు ఈ రెండు టైటిల్స్ పర్ఫెక్ట్‌గా సరిపోతాయని ఫిల్మ్ మేకర్స్ భివిస్తున్నారు. అయితే బోయపాటి మాత్రం ‘గాడ్ ఫాదర్’ అనే టైటిల్‌పై ఆసక్తిగా ఉన్నాడట. మొత్తానికి టీజర్‌లో మాత్రం బాలయ్య ఎప్పటిలాగే, పవర్‌ఫుల్ డైలాగ్స్, పవర్‌ఫుల్ యాక్షన్‌తో… పైగా పంచ కట్టులో వైట్ అండ్ వైట్‌లో అభిమానులను బాగానే అలరించారు. ఏమైనా బాలయ్యకు ఈ సారి కూడా బోయపాటి సూపర్ హిట్ ఇస్తాడని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు.

Balakrishna’s next movie title announcement on Ugadi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News