Home తాజా వార్తలు బాలాపూర్ ఎఎస్ఐకి కరోనా

బాలాపూర్ ఎఎస్ఐకి కరోనా

 

Balapur ASI corona virus positive

 

హైదరాబాద్: బాలాపూర్‌లో ఎఎస్‌ఐగా పని చేస్తున్న సుధీర్ కృష్ణకు కరోనా వైరస్ సోకింది. దీంతో సుధీర్‌ను గాంధీ ఆస్పత్రికి తరలించారు. లాక్‌డౌన్ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో సుధీర్ విధులు నిర్వహించాడు. విధులు నిర్వహిస్తున్నప్పుడు కరోనా సోకి ఉండొచ్చని వైద్యులు అభిప్రాయపడ్డారు. గత రెండు రోజులుగా తీవ్ర జ్వరం, దగ్గు, జలుబు ఉండడంతో స్థానిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్లను కలిశారు. అతడికి ఫీవర్ ఆస్పత్రిలో కరోనా టెస్టు చేయగా పాజిటివ్ అని తేలింది. వెంటనే గాంధీ ఆస్పత్రికి అతడిని తరలించారు. సదరు పోలీస్ స్టేషన్‌లో పని చేస్తున్న సిబ్బందిని క్వారంటైన్‌కు తరలించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. అతడి కుటుంబ సభ్యుల హోంక్వారంటైన్ చేసి కరోనా టెస్టు చేస్తున్నారు.