Home తాజా వార్తలు రూ.17.60 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ….

రూ.17.60 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ….

 

హైదరాబాద్: బాలాపూర్ మహా గణేశుడి శోభాయాత్ర ప్రారంభమైంది. భారీ వాహనంపైకి గణేశుడిని ఎక్కించి బాలాపూర్ లో ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. అనంతరం లడ్డూ వేలంపాట ప్రారంభించారు. ఈ వేలంపాటలో 19 మంది పోటీపడ్డారు. అయితే, గత ఏడాది రూ.16.60లక్షలు పలికిన బాలాపూర్‌ లడ్డూ, ఈ సారి ఎంత ధర పలుకుతుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో బాలాపూర్ లడ్డూ రికార్డు ధర పలికింది. ఏకంగా 17.60 లక్షలకు బాలాపూర్ లడ్డూను కొలను రాంరెడ్డి సొంతం చేసుకున్నాడు. కాగా, గత ఏడాది కంటే ఈసారి లక్ష రూపాయలు ఎక్కవ పలికింది. ఈ వేలంపాట అనంతరం ట్యాంక్ బండ్ వైపు 18 కిలోమీటర్ల మేర బాలాపూర్ గణేశుడి శోభాయాత్ర కొనసాగనుంది.

balapur laddu auctioned for Rs. 17.60 lakh