Wednesday, April 24, 2024

బాలయ్య ఫ్యాన్స్ కు బోయపాటి సర్ ప్రైజ్..

- Advertisement -
- Advertisement -

నందమూరి బాలకృష్ణ అభిమానులకు మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు. బాలయ్య, బోయపాటి కాంబినేషన్ లో మూడో చిత్రంగా ‘అఖండ’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. రేపు(జూన్ 10) బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా ద్వారా మూవీ యూనిట్ శుభాకాంక్షలు తెలియజేస్తూ అఖండ మూవీ నుంచి కొత్త పోస్టర్ ను విడుదల చేశారు. జాతరలో బాలయ్య కళ్లద్దాలు పెట్టుకొని చిరు నవ్వులు చిందిస్తూ నడుచుకుంటూ వస్తున్నట్లు పోస్టర్ లో కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇప్పటికే విడుదలైన ‘అఖండ’ టీజర్ 50 మిలియన్స్ వ్యూస్ రాబట్టి రికార్డ్ సృష్టించింది. తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోరుకు కూడా భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇందులో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా నటిస్తుండగా.. సీనియర్ హీరోలు జగపతి బాబు, శ్రీకాంత్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Balayya birthday special: Akhanda new poster release  

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News