Home సినిమా క్లైమాక్స్ ఫైట్‌లో బాలయ్య..!

క్లైమాక్స్ ఫైట్‌లో బాలయ్య..!

bala

హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ హీరోగా తమిళ డైరెక్టర్ కేఎస్ రవికుమార్ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని సి.కె. ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై సి.కళ్యాణ్ నిర్మిస్తున్నారు.ఈ చిత్రంలో నయనతార, నటాషా, హరిప్రియ కథానాయికలుగా నటిస్తున్నారు.తాజాగా ఈ సినిమా క్లైమాక్స్ చిత్రీకరణ పూర్తయిందని చిత్ర యూనిట్ తెలిపింది. అరివుమణి,అంబుమణిల సారథ్యంలో ఈ భారీ క్లైమాక్స్ ఫైట్‌ను చిత్రీకరించారు.ఈ సందర్భంగా నిర్మాత సి. కళ్యాణ్ మాట్లాడుతూ… అక్టోబర్ 5న మొదలైన క్లైమాక్స్ ఫైట్ ఎపిసోడ్‌ను అక్టోబర్ 15 వరకూ చిత్రీకరించామన్నారు. ఫైట్ మాస్టర్లు ఎంతో సహజంగా ఈ పోరాట సన్నివేశాలను డిజైన్ చేశారు. మూసాపేటలోని కంటైనర్ యార్డ్‌లో కీలక ఎపిసోడ్‌ను షూట్ చేశామని అన్నారు. ఈ సినిమాకు చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి ‘కర్ణ’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

Balayya in Climax Fight