Friday, April 19, 2024

బిజెపోళ్లు వస్తే కాళేశ్వరం నీళ్లకు బదులు రక్తం పారుతోంది: బాల్కసుమన్

- Advertisement -
- Advertisement -

Balka Suman comments on BJP
మంచిర్యాల: చాలా సంతోషకరమైన రోజు అని ఎంఎల్‌ఎ బాల్కసుమన్ తెలిపారు. చెన్నూర్ ఎత్తిపోతల పథకానికి నిధులు కేటాయించినందుకు సిఎం కెసిఆర్ కు రైతాంగం తరపున కృతజ్ఞత సభ నిర్వహించారు. ఈ సందర్భంగా బాల్కసుమన్ మీడియాతో మాట్లాడారు. దేశంలో అనేక రాష్ట్రాల మధ్య నదీజలాల మధ్య గొడవలు జరుగుతున్నాయని, నదీ జలాలను సమర్థవంతంగా ఎలా కాపాడుకోవాలో సిఎం కెసిఆర్ సూచించారన్నారు. మహారాష్ట్ర, ఎపి సిఎంలను ఆహ్వానించి కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించుకున్నామన్నారు. 30, 40 ఏళ్లు పాలించిన సన్నాసులకు నీళ్లు ఎలా కాపాడుకోవాలో తెలియదన్నారు. రూ.1658 కోట్లతో చెన్నూరు నియోజకవర్గంలో 90 వేల ఎకరాల్లో సాగునీరు అందిస్తున్నామని, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వెంకటస్వామి కుటుంబం అనుకుంటే వేల కోట్లు నిధులు తెచ్చేవారని, వెంకటస్వామి కుటుంబం ప్రజల అభివృద్ధి గురించి పట్టించుకోలేదని మండిపడ్డారు. ఓట్ల పునాదుల మీద వెంకటస్వామి కుటుంబం రాజకీయ కోటలు నిర్మించుకున్నారని బాల్కసుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులకు సుద్దారం బ్రిడ్జి కట్టాలన్న సోయి కూడా లేదని ఎద్దేవా చేశారు. తన నియోజకవర్గంలో రూ.120 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచే పార్టీ టిఆర్‌ఎస్ ధీమా వ్యక్తం చేశారు. చెన్నూరులో టిఆర్‌ఎస్‌దే గెలుపని, కాంగ్రెస్, బిజెపి సర్వేలు చెప్పాయన్నారు. సింగరేణి ప్రాంతంలోకి బిజెపి నేతలు వస్తే చెప్పులతో కొట్టాలని పిలుపునిచ్చారు.

రెండు బొగ్గు బ్లాక్‌లు సింగరేణికి ఇస్తేనే బిజెపి నేతలు అడుగు పెట్టాలని నిలదీశారు. గుజరాత్ గులామ్‌లు తెలంగాణపై దండయాత్రకు వస్తున్నారని, మతం పేరుతో నాలుగు ఓట్లు, సీట్లు సంపాదించాలని చూస్తున్నారని, ఎక్కడ ఎన్నికలు వచ్చినా మత కలహాలు సృష్టిస్తారని, హైదరాబాద్, తెలంగాణ పేరు పొగొట్టుకోవద్దని సూచించారు. ముస్లిం దేశాల్లో ఉన్న హిందువులను వెళ్లగొడితే బిజెపి నాయకులు ఉద్యోగాలు ఇస్తారా? అని బాల్కసుమన్ ప్రశ్నించారు. అమిత్ షా కుమారుడు వెళ్లి అరబ్ షేక్‌లతో వ్యాపారాలు చేస్తున్నాడని, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమారుడు నాలుగు లక్షల బైక్ కొని నడుపుతున్నాడని, మాజీ ఎంపి వివేక్, ఎంఎల్‌ఎ ఈటెల రాజేందర్ కుమార్‌డు ఎసిల్లో ఎంజాయ్ చేస్తున్నారని బాల్కసుమన్ విమర్శలు గుప్పించారు. సాధారణ బిజెపి యువకులు రోడ్లపైకి వచ్చి లొల్లి పెట్టుకోవాలా? అని అడిగారు.

గుజరాత్ గులాంల తెలంగాణ కావాలా? గులాబీ తెలంగాణ కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు. గుజరాత్ గులాంల తెలంగాణ వస్తే కాళేశ్వరం నీళ్లకు బదులు రక్తం ఏరులై పారుతోందన్నారు. గుజరాత్ గులాంలు తెలంగాణకు వస్తే మతకలహాలు, కర్ఫూలు ఉంటాయన్నారు. బిజెపికి కాంగ్రెస్ బిటీమ్‌గా పని చేస్తోందన్నారు. టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గతంలో ఎబివిపి కార్యకర్తగా పని చేశాడని, హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌ను తాకట్టు పెట్టించాడని బాల్కసుమన్ గుర్తు చేశారు. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్‌ను బిజెపికి తాకట్టు పెడుతాడని విమర్శించారు. కృతజ్ఞత సభలో పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంఎల్‌ఎ బాల్క సుమన్ హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News