Home తాజా వార్తలు ప్రతిపక్షాల మాటలు కామిడీ షోలుగా ఉన్నాయి

ప్రతిపక్షాల మాటలు కామిడీ షోలుగా ఉన్నాయి

Balka Suman controversial comments on pawan

 

హైదరాబాద్: కాంగ్రెస్, బిజెపి మాటలు ప్రజలకు కామిడీ షోలా ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వ విప్ బాల్కసుమన్ ఎద్దేవా చేశారు. అవగాహన లేకుండా, అభివృద్ధిపై చిత్తశుద్ధిలేకుండా ప్రతిపక్షాలు కామిడీ షోలు చేస్తున్నాయని హేళన చేశారు. శనివారం టిఆర్‌ఎస్ పార్టీ కార్యలయంలో బాల్కసుమన్ మీడియాతో మాట్లాడుతూ… ప్రతిపక్ష పార్టీల విధాలనాలను తూర్పారబట్టారు. కెటిఆర్ రోడ్ షోల కార్యక్రమం ప్రకటించగానే బిజెపి,కాంగ్రెస్ ఆందోళనలో ఉన్నాయని ఆయన అన్నారు. టిఆర్‌ఎస్ ప్రశాంతంగా ఉంటే ప్రతిపక్ష పార్టీల నాయకుల్లో భేదాభిప్రాయాలున్నాయని మిమర్శించారు. టిఆర్‌ఎస్ ప్రకటించిన జాబితాలో సామాజిక న్యాయం జరగడంతో పాటుగా సగానికి పైగా డిగ్రీ పూర్తి చేసిన విద్యావంతులు ఉన్నారని ఆయన చెప్పారు. జనసేనా అధినేత రాజకీయాలంటే సినిమా షోలు అనుకుంటున్నారని బాల్కసుమన్ నిందించారు.

పవన్‌కళ్యాన్ ఎపిలో రెండు చోట్ల పోటీ చేస్తే ఒక్కచోటులో కూడా గెలవలేదన్నారు. పక్కరాష్ట్రంలో పనికి రాని వ్యక్తితో హైదరాబాద్‌లో రాజకీయాలేంటో ప్రతిపక్షాలకే తెలియాలన్నారు. బండి సంజయ్ మాటలు అభ్యంంతకరంగా ఉన్నాయన్నారు. ఆయన హుందాగా ప్రవర్తించాలని బాల్కసుమన్ హితవు చెప్పారు. బిజెపి కార్యాలయంలో జర్నలిస్టులను కొట్టడాన్ని బాల్కసుమన్ తీవ్రంగా ఖండించారు. జర్నలిస్టుల స్వేచ్ఛను అడ్డుకుంటే ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదన్నారు. బిజెపి పాలిత రాష్ట్రాలు ఉత్తర ప్రదేశ్, గుజరాత్‌లో ఏమి జరుగుతుందో తెలుసుకోవాలని ప్రజలను కోరారు. తెలంగాణ రాష్ట్రంలోఅమలవుతున్న సంక్షేమ పథకాలు బిజెపి పాలితరాష్ట్రాల్లో ఎందుకు అమలు కావడంలేదని ఆయన ప్రశ్నించారు.

తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్పలేక బిజెపి తప్పుడు ప్రచారానికి ఒడిగట్టిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సరఫరా 24 గంటలు జరుగుతుందని, హైదరాబాద్‌లో తాగునీటి సమస్యలను టిఆర్‌ఎస్ పరిష్కరించిందని ఆయనన గుర్తు చేశారు. హైదరాబాద్ చరిత్రలో ఏనాడు జరగని అభివృద్ధిని టిఆర్‌ఎస్ ప్రభుత్వం చేసి చూపించిందన్నారు.ఒకప్పుడు కర్ఫూలతో తల్లడిల్లిన హైదరాబాద్ టిఆర్‌ఎస్ పాలనలో శాంతి యుతంగా ప్రజలు హాయిగా జీవిస్తున్నారని చెప్పారు. బిజెపి మాయమాటలను ప్రజలు ఎక్కడికక్కడ ఎండగట్టాలని బాల్కసుమన్ పిలుపునిచ్చారు.

Balka Suman controversial comments on pawan