Home తాజా వార్తలు ప్రాజెక్టులకు అనుమతులివ్వాల్సిందే

ప్రాజెక్టులకు అనుమతులివ్వాల్సిందే

Balka Suman

 

తెలంగాణ దేశంలో లేదా?
కేంద్రాన్ని ప్రశ్నించిన ఎంఎల్‌ఏ బాల్కసుమన్

మన తెలంగాణ/హైదరాబాద్: గత ఉమ్మడిపాలకులు తెలంగాణ అభివృద్ధిని విస్మరించడంతో ఏర్పడ్డ నీటి కష్టాలను తీర్చేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ నిరంతరం శ్రమిస్తుంటే ఏనాడు ప్రాజెక్టులకోసం తట్టెడు మట్టి ఎత్తని కాంగ్రెస్, కేంద్రం నుంచి పైసాకూడా సాహయం చేయని బిజెపినాయకులు అసత్యఆరోపణలు, అవగాహన రాహిత్యమైన వ్యాఖ్యానాలు చేయడం హాస్యస్పదమన్నారు. బుధవారం టిఆర్‌ఎస్ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శాసనసభ్యుడు సుమన్, శాసనమండలి సభ్యుడు వి. గంగాధర్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్, బిజెపి విధానాలను తూర్పారబట్టారు. కాంగ్రెస్ ఎంఎల్‌సి జీవన్ రెడ్డి, బిజెపి నేత లక్ష్మణ్ అసత్య ఆరోపణలతో ప్రజల ముందుకు వచ్చి ముఖ్యమంత్రి కెసిఆర్‌ను విమర్శించడం మానుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవల్సి వస్తుందని హెచ్చరించారు.

ప్రపంచంలో నిర్మించిన ఎత్తిపోతల పథకాల్లో కాళేశ్వరం నంబర్‌వన్‌గా నిలవడంతో ఓర్చుకోలేని కాంగ్రెస్,బిజెపి కడుపుమంటతో అసత్యఆరోపణలు చేస్తుందని బాల్కసుమన్ దుయ్యబట్టారు. కాళేశ్వరానికి అనుమతి ఇచ్చింది కేంద్రప్రభుత్వమేనని బిజెపినాయకుడు లక్ష్మణ్ అంటున్నారు. తెలంగాణ దేశంలో అంతర్భాగం కాదాని బాల్కసుమన్ లక్ష్మణ్‌ను ప్రశ్నించారు. రాష్ట్రాలు సొంతనిధులతో ప్రాజెక్టులు కట్టుకుంటున్నప్పుడు ఖచ్చితంగా కేంద్రం అనుమతులు ఇచ్చి తీరాల్సిందేనన్నారు. అనుమతులు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రప్రభుత్వపైలేదాని సుమన్ ప్రశ్నించారు. తెలంగాణ ప్రజాప్రతినిధులు ఢిల్లీలో ఎంతో కష్టపడితేకాని ప్రాజెక్టుకు అనుమతులు లభించాయని చెప్పారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం ఒక్కపైసాకూడా సహాయం చేయలేదని విమర్శించారు. సిఎం కెసిఆర్ వాస్తవాలను ప్రజల ముందు పెడితే బిజెపి నేతలకు ఎందుకు ఉలికిపాటని డాక్టర్ లక్ష్మణ్‌ను ఆయన నిదీశారు.

టిఆర్‌ఎస్ వ్యతిరేకపార్టీలకు సరైన సమయంలో ప్రజలు గుణపాఠంనేర్పుతారని హెచ్చరించారు. నిజాలు మాట్లాడటం బిజెపి నేర్చుకోవాలన్నారు. కాంగ్రెస్ నాయకుడు జీవన్‌రెడ్డి అవగాహనలేక కాళేశ్వరం పై మాట్లాడుతున్నారని బాల్కసుమన్ విమర్శించారు. తుమ్మిడిహట్టి కంటే మేడిగడ్డ దగ్గరే నీటి లభ్యత ఎక్కువగా ఉంటుందనే విషయం జీవన్‌రెడ్డికి తెలియకపోవడం విచారకరమన్నారు.ప్రాజెక్టు అంచనావ్యయం పైకూడా జీవన్‌రెడ్డి ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారన్నారు. ఆయకట్టు భారీగా పెరగడంతోనే అంచనావ్యయం పెరిగిందని వివరించారు. ఏపి, మహారాష్ట్ర, కేంద్రంలో కాంగ్రెస్ పాలన ఉన్నప్పుడుకూడా సాగునీటి ఒప్పందాలు చేసుకోలేకపోయని విమర్శించారు. కాళేశ్వరం నీళ్లు తెలంగాణ బీళ్లు తడుపుతుంటే కాంగ్రెస్,బిజెపిలకు కళ్లల్లో నీళ్లు రావడం ఖాయమన్నారు. ఆసూయ,ద్వేషాలతో మాట్లాడుతున్న కాంగ్రెస్,బిజెపి నేతలకు తెలంగాణ రైతులనుంచి ఆగ్రహం తప్పదన్నారు. అపరభగీరథు డు కెసిఆర్‌ను ప్రజలు ఎప్పుడూ గుండెళ్లో పెట్టుకుని పూజిస్తారన్నారు.

మూసరాజకీయాలు, రొటిన్ విమర్శలను కాంగ్రెస్ మానుకోవాలని హితవు పలికారు, సరిహద్దురాష్ట్రాలతో సంబంధాలు పెంచుకుని సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తున్న కెసిఆర్ దేశానికి ఆదర్శమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కాంగ్రెస్,బిజెపి నాయకులు శనీశ్వరుల్లా దాపురించారన్నారు.బిజెపి శాసనమండలి సభ్యుడు వి. గంగాధర్ మాట్లాడుతూ నేను ప్రాథమిక పాఠశాలలో చదువుతున్నప్పుడు జవహర్‌లాల్‌నెహ్రూ శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టు శం ఖు స్థాపన చేసినా ఇప్పటివరకు పూర్తి కాలేదని విమర్శించారు. మూడేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి సిఎం కెసిఆర్ చరిత్రసృష్టించారని ఆయన అన్నారు. శాసనసభ, మండలి ఒకేదగ్గర ఉండే విధంగా నిర్మించాలని సిఎంకెసిఆర్ నిర్ణయిస్తే కాంగ్రెస్, బిజెపి నాయకులు వింతవాదన చేస్తున్నారన్నారు.

Balka Suman, MLC Gangadhar Fires on Congress, BJP