Thursday, April 25, 2024

దొంగే దొంగ అన్నట్టు ప్రవర్తిస్తున్నారు..

- Advertisement -
- Advertisement -

Balka Suman press meet over Etela Land Issue

హైదరాబాద్: ఎస్సి, ఎస్టీల భూములను ఈటల రాజేందర్ అడ్డగోలుగా కబ్జా చేశారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. మంగళవారం ఉదయం టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యే ముఠా గోపాల్, ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాల్క సుమన్ మాట్లాడుతూ.. ”ఈటల రాజేందర్ భార్య జమున హచరిస్ పైన మెదక్ కలెక్టర్ మాట్లాడారు. ప్రభుత్వ, ఎస్సి, ఎస్టీ భూములను కబ్జా చేసారని కలెక్టర్ చెప్పారు. నీతి నిజాయితీ ఉంది అంటున్న ఈటల రాజేందర్ 70 ఎకరాల భూములను ఏ విదంగా కబ్జా చేశారు.కలెక్టర్ ఆధారాలతో సహా చూపించారు. తప్పైందని ఈటల ముక్కు నేలకు రాయాలి. కబ్జాలు చేసేది వీల్లే, నోరు లేని పేదల భూములను లాక్కుంటారు, పర్యావరనానికి హాని కలిగిస్తారు. మళ్ళీ వీల్లే దొంగే దొంగ అన్నట్టు ప్రవర్తిస్తున్నారు.తప్పు అని రుజువైతే ముక్కు నేలకు రాస్తా అన్నాడు ఈటల రాజేందర్. ఇప్పటికైనా హుజురాబాద్ ప్రజలు ఈటల తీరును గమనించాలి. ప్రభుత్వ భూములు ప్రభుత్వానికి, పేదల భూములు పేదవారికి ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్న. రాబోయే రోజుల్లో చట్టపరమైన చర్యలు తప్పకుండా ఉంటాయి. కబ్జాకోరు దగాకోరు లాంటి వాళ్ళ నిజస్వరూపాన్ని హుజురాబాద్ ప్రజలు గమనించాలి. అక్కడి కలెక్టర్ నిజాయితీగా పని చేస్తున్నాడు. కానీ అతన్ని భయపట్టే ప్రయత్నం చేస్తున్నారు. అధికారులను, కలెక్టర్ పైన ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఇంకా ఎక్కడెక్కడ భూములు కబ్జాకు గురయ్యయ్యో కలెక్టర్ నిగ్గూ తేల్చాలి” అని పేర్కొన్నాడు.

Balka Suman press meet over Etela Land Issue

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News