Friday, March 29, 2024

నిరాడంబరంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం

- Advertisement -
- Advertisement -

Balkampeta yellamma Kalyanam

 

ఆలయ అర్చకులతో కళ్యాణోత్సవం నిర్వహణ

మన తెలంగాణ, అమీర్‌పేట : నగరంలో అషాడ మాసంలో లక్షలామంది భక్తుల మధ్య అంగరంగ వైభవంగా జరిగే బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం ఈఏడాది ఆలయ అర్చకులతో నిరాడంబరంగా జరిగింది. కరోనా మహమ్మారి విజృంభణతో భక్తులు లేకుండా అమ్మవారి కళ్యాణం నిర్వహించారు.అమ్మవారి ఆలయ ప్రాంతమంతా ప్రతి ఏడాది ఎంతో రద్దీగా ఉండే చుట్టుపక్కల పరిసరాలు ఈసారి భక్తుల సందడి లేక వెలవెలబోయింది.

మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఆదేశాల మేరకు భక్తులు కళ్యాణ మహోత్సవానినికి తరలిరాలేదు. ఆలయ ప్రధాన అర్చకులు బాలకృష్ణ శర్మ వేద పండితులు సమక్షంలో మంగళవారం మధ్యాహ్నం 11.48 గంటలకు ఆలయ నిర్వహకులు దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ కుంట నాగరాజు ఆధ్యర్యంలో అత్యంత వైభవంగా ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం నిర్వహించారు. ఈకార్యక్రమంలో ఆలయ చైర్మన్ కె. సాయిగౌడ్, ఆలయ సూపరింటెండెంట్ రమేష్‌తో పాటు ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News