Home తాజా వార్తలు మీవి విద్వేష రాజకీయాలు

మీవి విద్వేష రాజకీయాలు

balka-suman

 రక్తపుటేరులు పారించే లక్షం మీది
 నీళ్లు పారించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే ధ్యేయం మాది : తెలంగాణ బిజెపికి బాల్క సుమన్ బహిరంగ లేఖ

మన తెలంగాణ/హైదరాబాద్ : బిజెపితోనే బంగారు తెలంగాణ సాధ్యమని ఆ పా ర్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు ద య్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని చెన్నూరు ఎంఎల్‌ఎ బాల్క సుమన్ విమర్శించారు. విద్వేష రాజకీయాలు రెచ్చగొట్టి, రక్తపుటేరులు పారించే లక్షం మీది…నీళ్లు పారించి రాష్ట్రాన్ని అభివృద్ది చేసే ధ్యేయం మాది అని పేర్కొన్నారు. తెలంగాణ బిజెపికి చెన్నూర్ ఎంఎల్‌ఎ బాల్క సుమన్ బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ అభివృద్ది విషయంలో కేంద్రంలో మీ పార్టీ నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం తెలంగాణ అభివృద్ది విషయంలో వివక్ష పాటించింది వాస్తవం కాదా..? అని ప్రశ్నించారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలను నీతి అయోగ్ బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించి శభాష్ అని మెచ్చుకున్న సంగతి లక్ష్మణ్‌కు తెలియదా..? అని అడిగారు. రూ.24 వేల కోట్ల నిధు లు ఇవ్వాలని కేంద్ర సర్కారుకు నీతి అయోగ్ సిఫా ర్స్ చేసిందని, అయినా చిల్లిగవ్వ కూడా ఇవ్వని మీ పార్టీతో బంగారు తెలంగాణ సాధ్యమా..? ఇ ది ప్రజలను మోసం చేయడం కాదా..? అని లేఖ లో పేర్కొన్నారు. అంతే కాదు కాళేశ్వరానికి నిధు లు ఇవ్వాలని, జాతీయ హోదా కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నెత్తినోరు కొట్టుకున్నా రూపాయి కూడా విదిలించని మీరు బంగారు తెలంగాణ చేస్తారంటే ప్రజలు నమ్ముతారనుకుంటున్నారా..? యుపిఎ2 ప్రభుత్వం ఇచ్చిన ఐటిఐఆర్ ప్రాజెక్టును మూలన పడేసింది మీ ప్రభుత్వం కాదా..? ఆ ప్రాజెక్ట్ వస్తే అనేక మందికి ఉపాధి అవకాశాలు దొరికేవని పేర్కొన్నారు.

ఎన్నిసార్లు కేంద్రానికి దరఖాస్తులు బుట్టదాఖలు చేశారే తప్ప పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన ఎస్‌టి, బిసి రిజర్వేషన్ పెంపు బిల్లులను కేంద్ర సర్కార్ బుట్టదాఖలు చేసిందనే విషయం రాష్ట్ర బిజెపి నాయకత్వానికి తెలియదా..? అని ప్రశ్నించారు. విభజన హామీల విషయంలో కేంద్ర సర్కార్ ఐదేళ్ల కాలంలో ఎప్పుడైనా కేంద్ర ప్రభుత్వాన్ని అడిగిందా..? మా రాష్ట్ర అభివృద్ది విషయంలో ఎందకంత వివక్ష చూపిస్తున్నారని ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లారా..? మీరు బంగారు తెలంగాణ గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉంది అని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన విభజన చట్టంలోని ట్రైబల్ యూనివర్సిటీ ఏమైంది..? హార్టికల్చర్ యూనివర్సిటీ ఏమైంది..? ఖమ్మం జిల్లా బయ్యారంలో నిర్మించ తలపెట్టిన ఉక్కు పరిశ్రమ ఏమైంది..? ఖాజీపేటలో పెడతామన్న కోచ్ ఫ్యాక్టరీ ఏమైంది..? వెనుకబడిన జిల్లాల అభివృద్దికి ఇస్తామన్న గ్రాంట్లు ఏమయ్యాయి..? తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకుని మూడేళ్లు గడుస్తున్నా ప్రతి జిల్లాకు ఇవ్వాల్సిన కేంద్రీయ విద్యాలయం, నవోదయ విద్యాలయం, కృషి విజ్ఞాన కేంద్రాలు ఏమయ్యాయి..?

ఈ హామీల అమలు కోసం గత ఐదు సంవత్సరాలుగా లోక్‌సభలో టిఆర్‌ఎస్ ఎంపిలు కేంద్రప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చినా కనీస చలనం లేదు అని పేర్కొన్నారు. స్వయంగా తాను నాడు పార్లమెంట్ సభ్యుడిగా పలుమూర్లు లోక్‌సభలో ప్రస్తావించినా ఫలితం శూన్యమని అన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే, కేంద్రంలోని మీ పార్టీ నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం తెలంగాణ అభివృద్ది విషయంలో అడుగడుగునా వివక్ష చూపించిందని పేర్కొన్నారు. మీరు మాతో బంగారు తెలంగాణ సాధ్యం అని చెప్పడం దయ్యాలు వేదాలు వల్లించడం కాక ఇంకేమౌతుంది..? అంతెందుకు గత ఐదున్నర సంవత్సరాలలో విభజన హామీలను నెరవేర్చాలని బిజెపి రాష్ట్ర నాయకులు కేంద్ర నాయకత్వాన్ని ఎన్ని సార్లు కలిశారో చెప్పాలి..? అని నిలదీశారు.
తెలంగాణ బిల్లను ఆమోదించిన రోజు బ్లాక్ డేగా వర్ణించారు
రాష్ట్ర అభివృద్దికి సహకరించకపోగా, మీ జాతీయ అధ్యక్షుడు అడుగడుగునా తెలంగాణపై విషయం చిమ్ముతున్నాడని, అబద్దాలు చెబుతూ వచ్చారని పేర్కొన్నారు. సమయం సందర్భం లేకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై అక్కసు ప్రదర్శిస్తున్నారని అన్నారు. మొన్నటికి మొన్న రాజ్యసభలో, నిన్నటికి నిన్న లోక్‌సభలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును ఆమోదించిన రోజును బ్లాక్ డేగా వర్ణించారని పేర్కొన్నారు.
అంతకుముందు రాష్ట్రానికి వచ్చి కేంద్రం పెద్ద ఎత్తున నిధులు ఇస్తున్నట్లు అబద్దాలు చెప్పారని, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దానిపై వివరణ ఇస్తే ఇంతవరకు మీ వైపు నుంచి సమాధానం లేదని పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మోడీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై విషం చిమ్మారని, తల్లిని చంపి పిల్లను బ్రతికించారంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారని అన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా బిహార్‌లో జరిగిన ప్రచార సభలో మోడీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ను విభజించినవాళ్లే దేశాన్ని భజించాలనుకుంటున్నారంటూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై మరోసారి విషం చిమ్మింది తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మరిచిపోరని పేర్కొన్నారు. ఒక ఓటు రెండు రాష్ట్రాలు అంటూ కాకినాడలో తీర్మానం చేసిన మీ పార్టీ ఆ తర్వాత మూడు రాష్ట్రాలు ఇచ్చారే కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందుకు రాలేదని, ఆనాటికే ఇక్కడ టిఆర్‌ఎస్ నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం ప్రారంభమైందని అన్నారు. నాడు కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్‌డిఎ ప్రభుత్వం తెలంగాణ విషయంలో వ్యతిరేక వైఖరితో ఉందని విమర్శించారు.
మీ విద్వేష రాజకీయాలను ప్రజలు ఎప్పటికీ మరచిపోరు
2014లో తెలంగాణ బిల్లును లోక్‌సభలో ఆమోదించే సందర్భంలో మీ కేంద్ర నాయకత్వం అడుగడుగునా ఆటంకాలు సృషించింది వాస్తవం కాదా..? రాజ్యసభలో సవరణల పేరుతో బిల్లును అడ్డుకోవాలని కుట్రలు చేసింది నిజం కాదా..? అలాంటి మీతో బంగారు తెలంగాణ సాధ్యమా..? ఇది మేం నమ్మాలా..? ప్రజలకు వాస్తవాలు తెలియదనుకుంటున్నారా..? మీ విద్వేష రాజకీయాలను, తెలంగాణ వ్యతిరేఖ వైఖరిని ప్రజలు ఎప్పటికీ మరచిపోరని లేఖలో పేర్కొన్నారు.

Balkan Suman open letter to Telangana BJP