Saturday, April 20, 2024

బాలకృష్ణ ‘పెళ్లెప్పుడు’ అని అడిగితే… ప్రభాస్ కొంటె జవాబు!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బాలకృష్ణ వ్యాఖ్యతగా ప్రేక్షకులను అలరిస్తున్న ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బికె’ ఎంతో మంది సెలబ్రిటీలతో సందడి చేస్తోంది. ఇప్పటికే ఎంతో మంది సినీ, రాజకీయ ప్రముఖులు ఈ షోలో పాల్గొని ప్రేక్షకులను మెప్పించారు. తాజా ఎపిసోడ్‌లో ప్రముఖ నటుడు ప్రభాస్, మరో నటుడు గోపిచంద్ సందడి చేశారు. ఆ ఇద్దరి సందడి ‘వావ్’ అనిపించేలా ఉంది. ఈ షోలో తాజాగా బాలకృష్ణ ప్రశ్నలకు ప్రభాస్ జవాబులిచ్చారు.

“పెళ్లెప్పుడు అని శర్వాను అడిగితే ‘ప్రభాస్ తర్వాత అన్నాడు’, మరి నీ సమాధానం ఏమిటి?” అని బాలకృష్ణ అడిగితే, ప్రభాస్ “నేను కూడా సల్మాన్ తర్వాత అని చెప్పాలేమో” అని జవాబివ్వడంతో అంతా నవ్వుకున్నారు. ఆ తర్వాత గోపిచంద్ ఎంట్రీతో ఆ సందడి రెట్టింపయింది. గమనించాల్సిన విషయం ఏమిటంటే,  ఈ ఎపిసోడ్ నూతన సంవత్సరం కానుకగా డిసెంబర్ 30 నుంచి ‘ఆహా’ వేదికలో ప్రసారం కానుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News