Home స్కోర్ విరాట్‌పై బాల్ టాంపరింగ్ ఆరోపణలు

విరాట్‌పై బాల్ టాంపరింగ్ ఆరోపణలు

Virat-Kholi

టీమిండియా టెస్టుజట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి మెడకు బాల్ టాంపరింగ్ ఆరోపణలు చుట్టుముడుతున్నాయి. స్వదేశంలో ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఈ నెల 9 నుంచి 13 వరకు జరిగిన తొలి టెస్టులో కోహ్లి బాల్ టాంపరింగ్‌కు పాల్పడినట్లు బ్రిటీష్ పత్రిక ‘ది డైలీ మెయిల్’ ఓ కథనాన్ని ప్రచురించడమేకాక తమ వద్ద ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆధారాలు కూడా ఉన్నట్లు తన కథనంలో పేర్కొంది.

ఈ కథనం ప్రకారం కోహ్లి తన నోట్లో ఉన్న ఓ స్వీటు పదార్థంతో బంతి మెరుపును తగ్గించేందుకు యత్నించినట్లు తెలిపింది.  అయితే దీనిపై ఇంగ్లాండ్ ఆటగాళ్లు గాని, అంపైర్లు గాని ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. నిబంధనల ప్రకారం టాంపరింగ్‌కు పాల్పడినట్లు ఆటగాళ్లు లేదా అంపైర్లు గుర్తించి 5 రోజులలోపు ఇంటర్నేషనల్ క్రికెట్ కమీటీ(ఐసిసి)కి ఫిర్యాదు చేయాలి. కానీ లా జరగలేదు. అయితే విశాఖ టెస్టులో ఇంగ్లాండ్ జట్టు ఓటమి తర్వాత సదరు ఇంగ్లీష్ పత్రిక ఈ కథనాన్ని ప్రచురించడం గమనార్హం.