Home అంతర్జాతీయ వార్తలు కిల్లర్ రోబోలపై నిషేధానికి ఆమ్నెస్టీ డిమాండ్

కిల్లర్ రోబోలపై నిషేధానికి ఆమ్నెస్టీ డిమాండ్

కిల్లర్ రోబోలపై ఆంక్షలు విధించాలని ఐక్యరాజ్య సమితిని కోరిన ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్
స్వయం పాలిత ఆయుధ వ్యవస్థలు హత్యలకు, అక్రమాలకు అవకాశం కల్పిస్తున్నాయి.
కీలకమైన నిర్ణయాలు అంతర్జాలంగా మానవ ప్రమేయం తప్పనిసరి.

Killer-Robo

కృత్రిమ మేధో సాంకేతిక వ్యవస్థపై ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యాన జెనివాల్ సదస్సు జరగనున్న సందర్భంగా ఆమ్నెస్టీ ఇంటర్‌నేషనల్ పిలుపునిచ్చింది. మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతూ అక్రమంగా చంపడం, గాయపర్చడం వంటివి జరగకుండా నిరోధించడానకి ‘కిల్లర్’ రోబోలను తప్పనిసరిగా నిషేధించాలని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఐక్యరాజ్యసమితిని అభ్యర్థించింది, జెనివాల్ ఈ వారం సంప్రదాయి ఆయుదాల వ్యవస్థ (సెర్పయిన్ కన్వెన్షనల్ వెపన్స్‌సిసిడబ్లు) గ్రూపునకు చెందిన ప్రభుత్వాల నిపుణులు (బిసిఇ) స్వయం పాలిత మారణాయుదాల వ్యవస్థపై ఈవారం సదస్సులో చర్చించనున్న సందర్భంగా ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఈ మేరకు పిలుపునిచ్చింది. స్వయంపాలిత మారణాయుధాల వ్యవస్థ అభివృద్దిపై కఠినమైన కట్టుబాట్లు విధించాలని అభ్యర్థించింది. మానవప్రమేయ ఆదేశాలతో, నిర్ణయాలతో సంబంధం లేకుండా స్వయం పాలిత మారణాయుధ వ్యవస్థ లక్షాలను ఎంపిక చేసుకొని వాటిని త్రుంచివేయడం గత దశాబ్ధ కాలంగా అభివృద్ధి చెందుతోంది. బ్రిటన్, ఫ్రాన్స్, ఇజ్రాయెల్, రష్యా వంటి దేశాలకు ఈ టెక్నాలజీ బాగా పరిచయమే.

మిలిటరీ, పోలీస్ ఆపరేషన్లలో ఆయా దేశాలు వీటిని (రోబోలను) ఉపమోగిస్తున్నాయి. సదస్సులో దేశాల సభ్యులు మానవహక్కులపై మాననీయత, నైతికత, భద్రతా పరమైన అంశాలపైన, కిల్లర్ రోబోల వల్ల ఎదురయ్యే చిక్కులు, సవాళ్లపైన సమగ్రంగా చర్చించాలని ఆమ్నెస్టీ కోరింది. ఈ కిల్లర్ రోబోరపై నిషేధం విదిస్తే ఆవాంఛనీయ సరిఘటనలు ఎదురుకాకుండా నివారించడానికి వీలవుతుంది. ప్రపంచ శక్తివంతమైన దేశాల మధ్య ఆయుధపోటీ నివరించడానికి సాధ్యమవుతుంది. ఈ అంశంపై డిమాండ్లు అత్యవసరమైనవిగా పరిశీలించాలని ఆయా దేశాలు చర్చించి తగిన విధానాలను రూపొందించాలని ఆమ్నెస్టీ కొరింది.

గత ఏప్రిల్ నెలలో 120 సభ్యత్వ దేశాలలో మెజారిటీ దేశాలు ఆయుధ వ్యవస్థలపై మానవ నియంత్రణను పునరుద్ధరించవలసిన ప్రాముఖ్యతను చర్చించాయి. ఈ దేశాలలో 26 దేశాలు స్వయం పాలిత మారణాయుధాల వ్యవస్థను పూర్తిగా నిషేధించాలని పిలుపునిచ్చాయి. ఆస్ట్రేలియా, బ్రెజిల్‌లాంటి అభివృద్ధి దేశాలు కూడా ఈ దేశాలలో ఉన్నాయి. కొత్త సిసిడబ్లు ప్రోటోకాల్‌ను మన్నిస్తూ స్వయంపాలిత ఆయుధ వ్యవస్థ వినియోగాన్ని నిషేదించాలని చైనా కూడా పిలుపునిచ్చింది. అయితే చట్టబద్దమైన నిషేదాలను రూపొందించడాన్ని ఫ్రాన్స్, ఇజ్రాయెల్, రష్యా, దక్షిణ కొరియా, అమెరికా, బ్రిటన్ వంటి ముఖ్యమైన దేశాలు వ్యతిరేకించాయి. ఈ ఆయుధాల వ్యవస్థ భవిష్యతు ఏ విధంగా ఉండాలో స్పష్టంకాలేదు. కానీ నిపుణులు మాత్రం రణక్షేత్రంగా మానవ నిర్ణయ విధానాలే ఈ ఆయుధ వ్యవస్థలో తప్పనిసరిగా అమలుకావాలని హెచ్చరించారు. మానవ ప్రమేయం తప్పనిసరి చేసేలా చట్టబద్ధమైన ప్రమాణాలు రూపొందించాలని ఆమ్నెస్టీ కోరుతుంది. అంతర్జాతీయ చట్ట నిబంధనల ప్రకారమే లక్షాల గుర్తింపు, ఎంపిక ఉండాలని వాదిస్తోంది.

కృత్రిమ మేధోతో కావలసిన రోబోల అభివృద్ధితో దేశాలు పోటీ పడుతున్నాయి. ఇవి మానవ రహిత మిలిటరీ రీపర్ డ్రోన్లను నియంత్రిస్తాయి.

ప్రస్తుతం యుఎవిలు మానవ ప్రమేయంతోనే క్షేత్ర నియంత్రణ కేంద్రం నుంచి నడుస్తున్నాయి. ఎక్కువ ఎత్తునుంచే యుద్ద విమానాలు త్వరలో లక్షాలను ఎంచుకొని క్షిపణులతో దాడి చేస్తాయి. ఇందులో మానవ ప్రమేయం ఉండదు.

ఆటోమేటెడ్ ట్యాంకుల అభివృద్ధికి మిలిటరీ అధికారులు కూడా మొగ్గు చూపుతున్నాయి.

ఇజ్రాయెల్‌తో సహా కొన్ని దేశాలు కృత్రిమ మేధో ఆయుధాలను ఇప్పటికే వినియోగిస్తున్నాయి. గాబేలోని ఆందోళన కారులపై టియిర్‌గ్యాస్ ప్రయోగించడానికి సెమి అటానమస్ డ్రోన్లను ఇటీవల వినియోగించారు.