Home Elections 2018 ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం

ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం

Ban on the Exit Polls

ఢిల్లీ : ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు సమీపిస్తున్నాయి. దీంతో ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్‌పై ఇసి నిషేధం విధించింది. మొదటి దశలో ఛత్తీస్‌గఢ్‌లో ఈనెల 12న ఎన్నికలు జరగనున్నాయి. మిగిలిన రాష్ట్రాల్లో దశలవారీగా ఎన్నికలు జరుగుతాయి. తెలంగాణ, రాజస్థాన్ అసెంబ్లీలకు డిసెంబర్ 7న జరిగే ఎన్నికలతో ఐదు రాష్ట్రాల పోలింగ్ ముగియనుంది. ఈ క్రమంలో తెలంగాణ, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ సోమవారం విడుదల కానుంది. ఈ క్రమంలో ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం విధిస్తూ ఇసి నిర్ణయం తీసుకుంది. ఈనెల 12వ తేదీ ఉదయం నుంచి డిసెంబరు 7వ తేదీ సాయంత్రం ఐదున్నర గంటలవరకు ఎగ్జిట్‌పోల్స్‌పై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.

Ban on the Exit Polls