Home ఖమ్మం ఆ బడి…. అమ్మ్మ ఒడి

ఆ బడి…. అమ్మ్మ ఒడి

ప్రైవేటుకు ధీటుగా విద్యాబోధన
దాతల ఆదరణ, ఉపాధ్యాయుల కృషి
సకల వసతుల సమాహారం

సర్కారీ బడిలో చదువంటే తల్లిదండ్రులు ఆమడదూరం వెళతారు. అక్కడన్నీ సమస్యలే ఉంటాయని.. ఉపాధ్యాయులకు ఇతర వ్యాపకాలెక్కువని.. ఇలా ఎన్నో కారణాలు చెబుతుంటారు. కానీ వీటికి పూర్తి భిన్నంగా నడుస్తోంది ముదిగొండ మండలంలోని బాణాపురం ప్రభుత్వ పాఠశాల. అక్కడ విద్య కార్పొరేట్‌కు ధీటుగా దొరుకుతుంది. ఉపాధ్యాయుల తీరు తండ్రి లాలనను తలపిస్తోంది. ఒక్కమాటలో… ఆ బడి అమ్మ ఒడిని మరిపిస్తుంది.

School1

ముదిగొండ : ప్రభుత్వ పాఠశాలలంటే రోజురోజుకూ ఆదరణ కోల్పోతున్న ప్రస్తుత తరుణంలో యావత్ పాఠశాలలకే ఆదర్శంగా నిలిచింది. ఈ పాఠశాల వసతుల కల్పనలోనే కాదు విద్యాబోధనలోనూ ప్రైవేటుకు ధీటుగా ముందుకు సాగుతుంది. దాతల సహకారం, ఉపాధ్యాయుల సిబ్బంది కృషి వెరసి అవిభాజ్య ఖమ్మం జిల్లాలోనే ఆదర్శంగా నిలిచింది. అదే బాణాపురం బడి. ముదిగొండ మండలం బాణాపురం ప్రాథమిక పాఠశాల ఈ పాఠశాలలో అన్ని వసతులున్నాయి.

విద్యుత్తు, కంప్యూటర్లు, టివి సరిపడ తరగతి గదులు, ఇనుప బీరువాలు, స్టేజి నిర్మాణం, విద్యార్థులకు తాగునీటి సౌకర్యం, భోజన ప్లేట్లు, గ్లాసులు, కూర్చునేందుకు బెంచీలు సమ కూర్చారు. ఇక విద్యాభ్యాసానికి సంబంధించి నోటు పుస్తకాలు, దుస్తులు, ప్రోగ్రెస్ కార్డులు, విద్యార్థులకు ఐడెంటి కార్డులు, ఒకటో తరగతి నుంచి ఐదు తరగతి వరకు విద్యార్థులకు నగదు ప్రోత్సహకాలు మండల స్థాయిలో విద్యార్థుల పోటీ పరీక్షలలో విజయాల సాధన వరకు బాణాపురమే బెస్టు అన్నభావన ఏర్పడింది.

ఈ పాఠశాల అభివృద్ది వెనుక కొందరి దాతృత్వం, ప్రధానోపాధ్యాయుడు పరిశే పుల్లయ్య, ఇతర సిబ్బంది కృషి ఉంది. గతంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల లాగానే ఉండే ఈ పాఠశాల 2013 నుండి క్రమేపి ఆదరణకు నోచుకుంది. పుల్లయ్య ప్రధానోపాధ్యాయుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ పాఠశాల రూపుమారిపోయింది. ఒక్కొక్కరు ఒక్కొక్కటి సమకూర్చటంతో ఆదర్శంగా నిలిచింది. పాఠశాల అభివృద్ధిలో ఆదయపన్ను మాజీ కమిషనర్ ఆవుల భాస్కర్‌రెడ్డి పాఠశాలకు ఒక కంప్యూటర్, 40 డెస్క్ బెంచీలను సమకూర్చటమే గాక గ్రామానికి వస్తే చాలు ప్రాథమిక పాఠశాలకు తప్పక వచ్చేవారు. బండ్ల నాగయ్య సౌండ్ సిస్టం సమకూర్చగా తోట సత్యనారాయణ దంపతులు ఎల్‌ఈడి టివిని బహూకరించారు.

బీమా ఉదయ్ కిరణ్ దంపతులు పాఠశాలకు గేటు, మినీ వాటర్ ట్యాంకును ఏర్పాటు చేశారు. కనపర్తి సీతయ్య, వట్టికూట వెంకటేశ్వర్లు, పాల్వాయి పాండు రంగారావు, పోట్ల బాబు విద్యావలంటీర్లకు వేతనాన్ని అందిస్తున్నారు. నెల్లూరి హన్మంతరావు, నెల్లూరి నరసింహా రావులు తరగతి గదులకు విద్యుత్తు సౌకర్యం కల్పించారు. మెడా రవి, పి.రాంబాబులు ఇనుప బీరువాలను, వాసవీ క్లబ్ బాణా పురం, ముత్తారం, మేడేపల్లి వారు భోజన ప్లేట్లు, నోటు పుస్త కాలు అందించగా గ్రామానికి చెందిన మానుకొండ హన్మం తరావు తదితరులు ఇతోదికంగా సహాయం అందించారు. దాతల నుంచి లభిం చిన సహకారంతో పాఠశాల ఆగ్రగామి గా నిలిచింది. బాణా పురం డెవలప్‌మెంట్ ఫౌండేషన్ సైతం పాఠశాల అభివృద్దికి అండగా నిలిచింది. పూర్వ విద్యార్థులు సహకరించారు. గ్రామస్తులు పాఠశాలను తమదిగా భావిస్తే ఎలా ఉంటుందో, దినదినాభివృద్ధి చెందుతుందో అని చెప్పేం
దుకు ఈ పాఠశాలే ఉదాహారణ ఇదే రీతిన ఇతర ప్రభుత్వ పాఠశాలలకు సహకారం అందిస్తే ప్రైవేటు మోజు తగ్గుతుంది.

చదువు నేర్పిన బడి కన్నతల్లితో సమానం

జీవితానికి దిశా, నిర్దేశమైన చదువు నేర్పిన బడి కన్నతల్లితో సమానం. బాణాపురం పాఠశాలలో ఉపాధ్యాయుల తీరు హర్షణీయం. సమష్టి కృషితో
పాఠశాలను ఉన్నత స్థితికి చేర్చుతున్నారు. ఇదే స్ఫూర్తితో ముందుకెళ్లాలి. ప్రతి ఒక్కరూ జన్మనిచ్చిన ఊరికి, పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలి.
– ఆవుల భాస్కర్ రెడ్డి, విశ్రాంత ఆదాయ పన్ను కమిషనర్