- Advertisement -
న్యూఢిల్లీ : కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌తో మంగళవారం సమావేశమయ్యారు. ఈ మేరకు గ్రామీణాభివృద్ధి, నిధులు, ఉపాధి హామీ, ప్రధానమంత్రి సడక్ యోజన కింద రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులను వెంటనే విడుదల చేయాలని తోమర్‌ను దత్తాత్రేయ కోరారు. వరంగల్‌లో రూ.126 కోట్లతో చేపట్టే ప్రాజెక్టుకు కేంద్ర ఆర్థిక సాయం అందించాలని అడిగామని తెలిపారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై హైదరాబాద్ వచ్చి సమీక్షిస్తామని తోమర్ చెప్పారని దత్తాత్రేయ వెల్లడించారు.
- Advertisement -