Home Default ప్రధాని మోడీతో దత్తాత్రేయ భేటీ

ప్రధాని మోడీతో దత్తాత్రేయ భేటీ

PM Modiఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీతో  హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ మంగళవారం భేటీ అయ్యారు. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం దత్తాత్రేయ మోడీతో భేటీ కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. సెప్టెంబరు 11న  హిమాచల్ ప్రదేశ్ 27వ గవర్నర్ గా దత్తాత్రేయ  బాధ్యతలు స్వీకరించారు. హిమాచల్ ప్రదేశ్ లో ప్రస్తుతం నెలకొని ఉన్న రాజకీయ పరిస్థితులపై దత్తాత్రేయ మోడీకి వివరించినట్టు విశ్వసనీయ సమాచారం మేరకు తెలుస్తోంది. దేశంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులపై కూడా వీరు చర్చించినట్టు తెలిసింది.

Bandaru Dattatreya Meets PM Modi