Home జాతీయ వార్తలు కశ్మీర్‌లో బంద్

కశ్మీర్‌లో బంద్

BANDH

శ్రీనగర్ : కశ్మీర్‌లో ఆదివారం బంద్ కొనసాగుతోంది. షోఫియాన్ జిల్లా గనోవ్‌పోరాలో రాళ్లు రువ్విన వారిపై శనివారం పోలీసులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ కాల్పుల్లో ఇద్దరు యువకులు మృతి చెందారు. దీంతో వేర్పాటువాదులు ఆదివారం బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో జనజీవనానికి అంతరాయం కలిగింది. శ్రీనగర్‌తో పాటు కొన్ని ప్రాంతాల్లో అధికారులు నిషేధాజ్ఞలు విధించారు. పలు చోట్ల ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. బంద్ నేపథ్యంలో కశ్మీర్‌లో విద్యా సంస్థలు, వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి. కశ్మీర్ వ్యాప్తంగా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

Bandh in Kashmir on Sunday