Home తాజా వార్తలు బంధన్ బ్యాంక్ లాభం 45 శాతం వృద్ధి

బంధన్ బ్యాంక్ లాభం 45 శాతం వృద్ధి

Bandhan Bank

 

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(201920) తొలి త్రైమాసిక ఫలితాల్లో(ఏప్రిల్‌జూన్) ప్రైవేటురంగ బంధన్ బ్యాంక్ నికర లాభం రూ.701 కోట్లతో 45.44 శాతం వృద్ధిని సాధించింది. గతేడాది ఇదే సమయంలో బ్యాంక్ లాభం రూ.482 కోట్లుగా ఉంది. బ్యాంక్ మొత్తం అడ్వాన్స్‌లు రూ.32,590 కోట్ల నుంచి రూ.45,420 కోట్లకు పెరిగాయి. ఫలితాల విడుదల సందర్భంగా బంధన్ బ్యాంక్ ఎండి, సిఇఒ సిఎస్ ఘోష్ మాట్లాడుతూ, సూక్ష్మరుణాలు మొత్తం అడ్వాన్స్‌లలో పెద్ద మొత్తంలో ఉన్నాయని అన్నారు. బ్యాంక్ మొత్తం డిపాజిట్లు రూ.43,701 కోట్లతో 42.33 శాతం పెరిగాయి. మార్కెట్లో బంధన్ బ్యాంక్ షేరు విలువ 0.22 శాతం నష్టపోయి రూ.527.50 వద్ద ముగిసింది.

Bandhan Bank net profit surges 45% to Rs 701 cr