Home తాజా వార్తలు బాందినీ బంధం

బాందినీ బంధం

Bandhani Sarees

 

గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో తయారయ్యే బాందినీ చీరలు మగువుల మనసును దోచుకుంటున్నాయి. వీటి తయారీ చాలా కష్టంగా ఉంటుంది. రకరకాల దారాలు మూటగట్టి కొక్కేల ద్వారా అద్దకం తొట్టెల్లో ఉంచుతారు. మడతలు తీసి చూస్తే వివిధ రకాల ఆకృతులతో అందమైన వన్నెలతో ఈ వస్త్రాలు తయారవుతాయి. ఈ ప్రక్రియ కూడా చాలా కష్టం. నెలల కొద్దీ సమయం తీసుకుంటుంది. కనువిందు చేసే రంగులు ముల్‌ముల్ లేదా మస్లిన్ వస్త్రంతో బాందినీ చీరెలు తయారు చేస్తారు. పట్టుతో తయారైన బాందినీ అందమే అందం.

Bandhani Silk Sarees in Jamnagar