Saturday, April 20, 2024

అందరికీ ఆమోదయోగ్యంగా కేంద్ర బడ్జెట్…

- Advertisement -
- Advertisement -

Bandi-Sanjay

హైదరాబాద్ : కేంద్రం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉందని కరీంనగర్ ఎంపి బండి సంజయ్‌కుమార్ అన్నారు. గ్రామీణ అభివృద్ధి, వ్యవసాయం, సాగునీరు అనుబంధ రంగాలకు అధిక ప్రాధాన్యతనిస్తూ రూ.2.83 కోట్లు కేటాయించడం హర్షణీయమని తెలిపారు. దేశానికి వెన్నెముక లాంటి అన్నదాతల ఆదాయాన్ని 2022 నాటికి రెట్టింపు చేయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. విద్యారంగానికి రూ.99,300 కోట్లు కేటాయించడం ద్వారా ప్రభుత్వం తన ప్రాధాన్యాన్ని స్పష్టం చేసిందని ఎంపి బండి సంజయ్ అన్నారు.

జౌళి రంగానికి రూ.1480 కోట్లు కేటాయింపులో ప్రభుత్వం చేనేత రంగానికి బాసటగా నిలవనుందని చెప్పారు. స్వచ్ఛభారత మిషన్‌తో దేశంలో పారిశుధ్య నిర్వహణలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయని తెలిపారు. ఈ ఏడాది కూడా రూ.12,౩౦౦ కోట్లు కేటాయించడం మరిన్ని సత్ఫలితాలు ఇవ్వనుందని చెప్పారు. యువతకు నైపుణ్యం శిక్షణ అందించింది.. స్వశక్తితో ఎదిగేలా నైపుణ్య అభివృద్ధి కే్రందాలకు రూ.౩ వేల కోట్లు కేటాయించారని తెలిపారు.

సామాజిక న్యాయం జరిగేలా ఎస్సీలు, ఓబీసీల సంక్షేమం కోసం రూ.85వేల కోట్లు, ఎస్టీల సంక్షేమం కోసం రూ.53వేల కోట్లు బడ్జెట్‌లో కేటాయించారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేసిందని టిఆర్‌ఎస్ ఎంపీలు ఆరోపించడం సబబు కాదని అన్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో.. కేంద్ర ప్రభుత్వం వాటా లేని పథకాలు ఏవో టిఆర్‌ఎస్ ఎంపీలు ముందు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

Bandi Sanjay said Union Budget is acceptable to everyone

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News