Saturday, April 20, 2024

అత్యంత నివాస యోగ్య నగరం బెంగళూరు

- Advertisement -
- Advertisement -

Bangalore is at top of list of livable cities

చిన్న నగరాల టాప్ 10 లో కాకినాడ
24 వ స్థానంలో హైదరాబాద్
ఈజ్ ఆఫ్ లివింగ్ సూచీ కేంద్రం విడుదల

న్యూఢిల్లీ : దేశంలోని మొత్తం 111 నగరాల్లో అత్యంత నివాస యోగ్య నగరంగా బెంగళూరు అగ్రస్థాననం సాధించింది. నగరాల్లో జీవనం సాగించడానికి అనుకూల పరిస్థితులను అధ్యయనం చేసి రూపొందించిన ఈజ్ ఆఫ్ లివింగ్ సూచీ జాబితాను కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ గురువారం విడుదల చేసింది. బెంగళూరు తొలి ర్యాంకు దక్కించుకోగా, తరువాత టాప్ 10లో పుణె, అహ్మదాబాద్, చెన్నై , సూరత్, నవీముంబై, కోయంబత్తూర్, వడోదర, ఇండోర్, గ్రేటర్ ముంబై ఉన్నాయి. 13 వ స్థానంలో ఢిల్లీ, 15 వ స్థానంలో విశాఖ, 24 వ స్థానంలో హైదరాబాద్ నిలిచింది.

జనాభా ఆధారంగా రెండుగా విభజించిన ఈ జాబితాలో పదిలక్షల మించి జనాభా కలిగిన 49 నగరాల్లో బెంగళూరు టాప్‌లో ఉండగా, ఢిల్లీ 13 వ స్థానంలో శ్రీనగర్ ఆఖరు స్థానంలో ఉన్నాయి. పది లక్షల కన్నా తక్కువ జనాభా కలిగిన 62 నగరాల్లో సిమ్లా టాప్‌లో ఉంది. ఈ కేటగిరిలో భువనేశ్వర్ రెండో స్థానం, సిల్వస్సా మూడో స్థానం దక్కించుకున్నాయి. కాకినాడ,సేలం, వెల్లూరు, గాంధీనగర్, గురుగ్రా, దావణగెరె, తిరుచిరాపల్లి టాప్ 10 ర్యాంకింగ్‌లు సాధించాయి. పది లక్షల జనాభా లోపు కేటగిరిలోని 62 నగరాల్లో ఢిల్లీ టాప్‌లో ఉండగా, ముజఫర్‌పూర్ ఆఖరి స్థానంలో నిలిచింది. మున్సిపల్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ మిలియన్ ప్లస్ జనాభా కేటగిరిలో ఇండోర్ అగ్రస్థానంలో ఉంది. సూరత్ రెండో స్థానంలో ఉండగా, తరువాత భోపాల్, పింప్రి, చించవాడ్,పుణె, అహ్మదాబాద్, రాయ్‌పూర్, గ్రేటర్ ముంబై, విశాఖపట్టణం, వడోదర ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News