Friday, March 29, 2024

ఢిల్లీకి చాలెంజర్స్ షాక్

- Advertisement -
- Advertisement -

Bangalore win over Delhi Capitals

రాణించిన శ్రీకర్ భరత్, మాక్స్‌వెల్
రిషబ్ సేనపై బెంగళూరు విజయం

దుబాయి: ఢిల్లీ క్యాపిటల్స్ వరుస విజయాలకు రాయ ల్ చాలెంజర్స్ బెంగళూరు బ్రేక్ వేసింది. శుక్రవారం ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు ఏడు వికెట్ల తేడాతో ఢిల్లీని ఓడించింది. చివరి బంతి వరకు నువ్వానేనా అన్నట్టు సాగిన మ్యాచ్‌లో కోహ్లి సేన అద్భుత విజయాన్ని అందుకుంది. చివరి బంతికి శ్రీకర్ భరత్ సిక్స్ కొట్టి బెంగళూరును గెలిపించాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఒక దశలో 55 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి న బెంగళూరును శ్రీకర్ భరత్, గ్లెన్ మాక్స్‌వెల్ ఆదుకున్నారు. అసాధారణ ఇన్నింగ్స్ ఆడిన భరత్ 52 బంతుల్లో మూడు ఫోర్లు, 4 సిక్సర్లతో 78 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మాక్స్‌వెల్ 8 ఫోర్లతో అజేయంగా 51 పరుగులు చేశాడు.

శుభారంభం

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఓపెనర్లు పృథ్వీషా, శిఖర్ ధావన్‌లు శుభారం భం అందించారు. ఇటు పృథ్వీ, అటు శిఖర్‌లు కీలక ఇన్నింగ్స్‌తో జట్టుకు అండగా నిలిచారు. ఒకవైపు వికెట్‌ను కాపాడుకుంటూనే చెత్త బంతులను బౌండరీలకు తరలించారు. పృథ్వీషా దూకుడును ప్రదర్శించగా, ధావన్ సమన్వయంతో ఆడాడు. ఈ జోడీని విడగొట్టేం దుకు ప్రత్యర్థి బౌలర్లు చేసిన ప్రయత్నాలు చాలా సేప టి వరకు ఫలించలేదు. మరోవైపు బెంగళూరు బౌలర్ల లో సిరాజ్, గార్టన్‌లు కచ్చితమైన లైన్ అండ్ లెన్త్‌తో బౌలింగ్ చేస్తూ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేసేందు కు ప్రయత్నించారు. అయితే త్వరగా వికెట్లను తీయడంలో మాత్రం విఫలమయ్యారు. కీలక ఇన్నింగ్స్ ఆడి న ధావన్ 35 బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్ల తో 43 పరుగులు చేసి హర్షల్ పటేల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

అప్పటికే తొలి వికెట్‌కు 88 పరుగులు జోడిం చాడు. మరోవైపు ధాటిగా ఆడిన పృథ్వీషా రెండు సిక్స ర్లు, 4 బౌండరీలతో 48 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత ఢిల్లీ ఆశించిన స్థాయిలో వేగంగా పరుగులు సాధించలేక పోయింది. జట్టును ఆదుకుంటారని భావించిన కెప్టెన్ రిషబ్ పంత్ (10), మాజీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (18) నిరాశ పరిచారు. అయి తే చివర్లో హెట్‌మెయిర్ రెండు సిక్సర్లు, రెండు ఫోర్ల తో వేగంగా 29 పరుగులు చేశాడు. దీంతో ఢిల్లీ స్కోరు 164 పరుగులకు చేరింది. ఇక బెంగళూరు బౌలర్లలో సిరాజ్ రెండు వికెట్లు పడగొట్టాడు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News