Home తాజా వార్తలు ప్లేఆఫ్‌కు బంగ్లాదేశ్

ప్లేఆఫ్‌కు బంగ్లాదేశ్

Bangladesh qualified for playoffs in T20 World Cup

 

మస్కట్: బంగ్లాదేశ్ ట్వంటీ20 ప్రపంచకప్‌లో ప్లేఆఫ్‌కు అర్హత సాధించింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 84 పరుగుల తేడాతో పపువా న్యూ గినియాను చిత్తు చేసి నాకౌట్ రేసుకు దూసుకెళ్లింది. మరోవైపు పపువా క్వాలిఫయింగ్ దశలో ఆడిన మూడు మ్యాచుల్లోనూ ఓటమి పాలైంది. ఇక కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో బంగ్లాదేశ్ అసాధారణ ఆటతో చెలరేగి పోయింది. షకిబ్ అల్ హసన్ ఈ మ్యాచ్‌లోనూ ఆల్‌రౌండ్‌షోతో అదరగొట్టాడు. కెప్టెన్ మహ్మదుల్లా కూడా మెరుపు బ్యాటింగ్‌తో జట్టు విజయంలో తనవం తు పాత్ర పోషించాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 181 పరుగులు సాధించింది. తర్వాత లక్షఛేదనకు దిగిన పపువా న్యూ గిని యా 19.3 ఓవర్లలో కేవలం 97 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయం చవిచూసింది. బంగ్లా బౌలర్లు వరుస క్రమంలో వికెట్లను పడగొడుతూ పపువాను కోలుకోనివ్వలేదు.

షకిబ్ దెబ్బకు విలవిల..
ఇక క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్‌ను ఆరంభించిన పపువా న్యూ గినియాకు ఆరంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. ఓపెనర్లు లెగా సియాకా (5), అసాద్ వలా (6) నిరాశ పరిచారు. సియాకాను సైఫుద్దీన్ వెనక్కి పంపాడు. ఆ వెంటనే కెప్టెన్ అసద్ వలా కూడా ఔటయ్యాడు. అతన్ని తస్కిన్ అహ్మద్ ఔట్ చేశాడు. ఆ తర్వాత షకి బ్ అల్ హసన్ అసాధారణ బౌలింగ్‌తో చెలరేగి పోయాడు. షకిబ్ దెబ్బకు పపువా న్యూగినియా బ్యాట్స్‌మన్ పెవిలియన్‌కు క్యూ కట్టా రు. చార్లెస్ అమిని (1), సెసె బావు (7), సిమోన్ అయాటి (0), హిరి హిరి (8)లను షకిబ్ వెనక్కి పంపాడు. నొర్మాన్ వనువా (౦)ను మెహదీ హసన్ ఔట్ చేయడంతో పపువా న్యూ గినియా 29 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి దిక్కుతోచని స్థితిలో పడిపోయింది.

ఈ దశలో వికెట్ కీపర్ కిప్లిన్ డొర్గియా అద్భుత బ్యాటింగ్‌తో పపువాను ఆదుకునేందుకు ప్రయత్నించాడు. బంగ్లా బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న కిప్లిన్ 34 బంతుల్లో రెండు సిక్స్‌లు, మరో 2 బౌండరీలతో 46 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. చాడ్ సోపర్ (11) కూడా తనవంతు పాత్ర పోషించారు. కాగా, పపువా జట్టులో కేవ లం ఇద్దరు మాత్రమే డబుల్ డిజిట్ స్కోరును అందుకున్నారు. బంగ్లా బౌలర్లలో షకిబ్ అల్ హసన్ 4 ఓవర్లలో 9 పరుగులు మాత్ర మే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. మహ్మద్ సైఫుద్దీన్, తస్కిన్ అహ్మద్‌లు చెరో రెండు వికెట్లను తీశారు.

సమన్వయంతో ఆడుతూ..
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్‌కు ఇన్నింగ్స్ తొలి ఓవర్ రెండో బంతికే షాక్ తగిలింది. ఓపెనర్ మహ్మద్ నయీం (0) ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. అయితే తర్వాత వచ్చిన షకిబ్ అల్ హసన్‌తో కలిసి మరో ఓపెనర్ లిటన్ దాస్ ఇన్నింగ్స్‌ను కుదు ట పరిచేందుకు ప్రతయ్నిం చాడు. ఇద్దరు ప్రత్యర్థి బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నారు. భారీ షాట్ల జోలికి వెళ్లకుండా సింగిల్స్‌తోనే స్కోరును ముందుకు తీసుకెళ్లారు. మరోవైపు ఈ జోడీని విడగొట్టేందుకు పపువా బౌలర్లు చాలా సేపటి వరకు వేచి చూడక తప్పలేదు. 23 బంతుల్లో ఒక ఫోర్, సిక్సర్‌తో 29 పరుగులు చేసిన లిటన్ దాస్‌ను అసద్ వలా ఔట్ చేశాడు. దీంతో 50 పరుగుల రెండో వికెట్ పార్ట్‌నర్‌షిప్‌కు తెరపడింది. తర్వాత వచ్చిన సీనియర్ ఆటగాడు ముష్ఫికుర్ రహీం మరోసారి నిరాశ పరిచాడు. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ తక్కవు స్కోరు కే పెవిలియన్ చేరాడు. ఈసారి ఐదు పరుగులు మాత్ర మే చేసి ఔటయ్యాడు.

మహ్మదుల్లా దూకుడు
అయితే కెప్టెన్ మహ్మదుల్లా దూకుడుగా ఆడుతూ స్కోరును పరిగెత్తించాడు. మరోవైపు షకిబ్ కూడా కీలక ఇన్నింగ్స్‌తో జట్టుకు అండగా నిలిచాడు. ప్రత్యర్థి బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న షకిబ్ 37 బంతుల్లో మూడు సిక్సర్లతో 46 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక తర్వాత వచ్చిన అఫిఫ్ హుస్సేన్‌తో కలిసి కెప్టెన్ మహ్మదుల్లా పోరాటం కొనసాగించాడు. వరుస ఫోర్లు, సిక్సర్లతో అలరించిన బంగ్లా కెప్టెన్ 28 బంతుల్లోనే 50 పరుగులు సాధించాడు. ఇందులో మూడు ఫోర్లు, మరో 3 సిక్సర్లు ఉన్నాయి. ఇక ధాటిగా ఆడిన అఫిఫ్ మూడు బౌండరీలతో 21 పరుగు లు చేశాడు. సైఫుద్దీన్ ఆరు బంతుల్లోనే రెండు సిక్సర్లు, ఒక ఫోర్‌తో అజేయంగా 19 పరుగులు చేయడంతో బంగ్లాదేశ్ స్కోరు 181 పరుగులకు చేరింది. మరోవైపు ఆల్‌రౌండ్‌షోతో బంగ్లా విజయంలో కీలక పాత్ర పోషించిన షకిబ్‌కు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది. కాగా, తొలి మ్యాచ్‌లో స్కాట్లాండ్ చేతి లో అనూహ్య ఓటమి పాలైన బంగ్లాదేశ్ ఆ తర్వాత వరుసగా రెండింటిలో గెలిచి ప్లేఆఫ్‌కు అర్హత సాధించింది.

Bangladesh qualified for playoffs in T20 World Cup