Home నిజామాబాద్ రుణం ఇవ్వమంటే..ఇవ్వనంటున్నాడు

రుణం ఇవ్వమంటే..ఇవ్వనంటున్నాడు

8 నెలలుగా ఇదే తంతు
మానసికంగా వేధిస్తున్న బ్యాంక్ అధికారి
ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన పట్టించుకోని అధికారులు

Loan-Waiver

నిజామాబాద్‌క్రైం: పేదరిక జీవితం, అనారోగ్యంతో మంచం ప ట్టిన భార్య… ఉద్యోగం లేక ఆర్థిక ఇబ్బందులతో పోరాటం… రోజు రోజుకు కు టుంబ పోషణ భారం కావడంతో ఏమి చేయలేని పరిస్థితి మానసికంగా కుంగిపో తున్న పరిస్థితి లక్ష్మినారాయణ చారి జీవితం… 2016లో ప్రభుత్వం బీసీ సం క్షేమ శాఖ నిరుద్యోగులకు బ్యాంకు రుణాలను మంజూరు చేస్తు ప్రకటన విడుదల చేసింది. లక్ష్మినారాయణ జిరాక్స్ సెంటర్ కోసం బీసీ సంక్షేమ శాఖలో ధరఖాస్తు చేసుకున్నాడు. ప్రభుత్వం 2016లో లబ్దిదారులకు రుణాలు మంజూరు చేస్తు ని ధులు విడుదల చేసింది. ఇందులో లక్ష్మినారాయణకు కూడా రూ.80 వేలు స బ్సిడీతో బ్యాంకు తరపున రూ.20 వేలు మొత్తం లక్ష రూపాయలు రుణం మం జూరైంది. కాని బ్యాంకు అధికారి రుణం మంజూరు చేయక తనచూట్టు తిప్పు కుంటు మానసికంగా గురి చేస్తున్నాడు. భరించలేని బాధితుడు ప్రజావాణిలో సైతం ఫిర్యాదు చేసిన స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

బ్యాంక్ అధికారి వేధింపు

నిజామాబాద్ నగరానికి చెందిన లక్ష్మి నారాయణ చారి బిసి వేల్ఫేర్‌లో జిరాక్స్ సెంటర్ కోసం ధరఖాస్తు చేసుకున్నాడు. మంజూరైన రూ.80 వేలతో కూడిన రూ. 20 వేలుతో లక్ష రూపాయల రుణం ఇ వ్వాల్సి ఉంది. లక్ష్మినారాయణ చారి రు ణంకు సంబంధించిన పూర్తి వివారలతో కూడిన దరఖాస్తులను స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, ప్రగతిభవన్ శాఖ బ్యాంక్ అధికారులకు సమర్పించాడు.
దరఖాస్తులు పరిశీలించిన బ్యాంక్ క్షేత్ర స్థాయి అధికారి రుణం మంజూరు విష యంలో సాకు పేరుతో జాప్యం చేస్తున్నారు. గత ఎనిమిది నెలలుగా బాధితుడిని బ్యాంక్ చుట్టు తిప్పుకుంటూ మానసిక వేదింపులకు గురి చేస్తున్నాడని, డాక్యు మెంట్లు గల్లంతై అయ్యాయని, మళ్లి తీసుకురావాలని చెబుతున్నాడు. ఇలా ఏదో ఒక్కటి సాకుతో రోజులు సాగదీస్తున్నాడు. వేదింపులు భరించలేని బాధితుడు బ్యా ంక్ మేనేజర్ సంప్రదించాడు. ఆయన ఫలితం శూన్యం కనిపించడంతో రుణం కోసం ఎదురు చూపులు చూస్తున్నాడు.

చలనం లేని అధికారి

తన కుటుంబ పరిస్థితి తన భార్యకు బ్రెన్ ట్యూమర్ సర్జరీ జరిగి మంచానా ఉన్న పరిస్థితిని ఆ బ్యాంక్ అధికారి ముందు పలుమార్లు మానసిక బాధ వ్యక్తం చేశాడు. మానవత దృక్పదంతో రుణం మంజూరు చేయాలని వేడుకున్న కాని ఆ అధికారి చలించలేదు. ఏదోఒక్క రూపంలో 8 నెలలుగా తన చుట్టు తిప్పుకుంటు కాలయా పన చేస్తున్నాడు.

ప్రజావాణిలో ఫిర్యాదు

బ్యాంకు అధికారి వేదింపులు భరించలేని బాధితుడు ప్రజావాణిలో ఫిర్యాదు చే శారు. ప్రభుత్వం మాత్రం న్యాయం చేయలేకపోయింది. ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తే తనకు న్యాయం జరుగుతుందని భావించిన బాధితుడికి చివరికి నిరాశే ఎదురైంది.
న్యాయం చేయాలి

ప్రభుత్వం మంజూరు చేసిన లక్ష రూపాయల రుణంను వెంటనే మంజూరు చేయాలి. బ్యాంక్ అధికారులు 8 నెలలుగా తిప్పుకుంటు తనను ఎంతో ఇబ్బందికి గురి చేస్తున్నాడు. ప్రభుత్వం సమస్యను గుర్తించి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి.
– లక్ష్మినారాయణ చారి, బాధితుడు