Wednesday, April 24, 2024

రైతులను నట్టేటా ముంచిండు

- Advertisement -
- Advertisement -

bank manager fraud in sbi bank at mahabubabad

మహబూబాబాద్: రైతుల పంట రుణాలలో సగం సొమ్ము తన జేబులో జమచేసుకుని, మిగతా సగం బ్యాంకు ఖాతాలలో జమచేసి ఓ బ్యాంకు మేనేజర్ ఏకంగా కోటి రూపాయల రైతుల పంట రుణాల సొమ్ము టోకరా వేశాడు. బయ్యారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం, గంధంపల్లి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ లక్ష్మణ్ రైతుల పంట రుణాలలో సగం తన జేబులో వేసుకుని మరో సగం నగదును బ్యాంకు వారికి జమ చేసేసి, అక్రమంగా రూ. 98,34,000 (దాదాపు కోటి రూపాయల) సొమ్మును రైతుల రుణాల నుండి దండుకున్నాడు. తమ లోన్ సమయం తీరినప్పటికీ తమకు ఇంకా బ్యాంకర్ల నుండి లోన్‌కు సంబంధించిన రిమైండర్లు వస్తుండడం, తమ ఖాతాలలో ఉండాల్సిన సొమ్ము తక్కువ చూపిస్తుండడంతో రైతులకు అనుమానం వచ్చి తమ బ్యాంకు ఖాతాల మిని స్టేట్‌మెంట్ తీసి చూసుకొని అనుమానం వచ్చి ప్రస్తుత బ్యాంకు మేనేజర్ వద్ద ఆందోళనకు దిగడంతో మంగళవారం రోజున అసలు విషయం బహిర్గతమైంది.

రైతుల ఆందోళన మేరకు వెంటనే ఖాతాలను విచారణ చేపట్టి చూడగా గత బ్యాంకు మేనేజర్ చేసిన స్కాం వెలుగులోకి వచ్చింది. గత మేనేజర్ అనధికారికంగా కొందరు ప్రైవేటు వ్యక్తులను తన ఆధీనంలో నియమించుకుని సుమారు 800 మంది రైతుల పంట రుణాలకు సంబంధించిన బ్యాంక్ ఓచర్లు మొదలుకుని సంతకాలు రైతుల వద్ద తీసుకుని రుణం సొమ్ము తిరిగి చెల్లించే సమయంలో సగం రుణం సొమ్ముకు జమ చేసుకుని, మిగతా సగం తన జేబులోకి చేర్చుకున్న విషయం బహిర్గతమైంది. ఇందు నిమిత్తం పూర్తి విచారణ జరగాలని ప్రస్తుత మేనేజర్ శ్యాంకుమార్ బయ్యారం పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు మాజీ బ్యాంకు మేనేజర్ లక్ష్మణ్‌పై చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News